ఈ ఏడాది ప్రారంభంలోనే సంక్రాంతికి వచ్చి నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ కొట్టాడు అల్లు అర్జున్. స్టైలిష్ స్టార్ అనే పేరును అల.. వైకుంఠపురములో సినిమాతో సార్ధకం చేసుకున్నాడు. పాటల్లో, యాక్షన్ లో, నటనలో బన్నీని ఓ రేంజ్ లో చూపించాడు దర్శకుడు త్రివిక్రమ్. అత్తారింటికి దారేది తరహాలోనే మొదటి పది నిముషాల్లో సినిమా కథ చెప్పేసి ఆసక్తి రేపాడు ఈ మాటల మాంత్రికుడు. తర్వాత సినిమా ఆద్యంతం తన డైలాగులతో, టేకింగ్ తో ప్రేక్షకులను కట్టి పడేసి ఇండస్ట్రీ హిట్ చేసేశాడు. సినిమా వచ్చి నెల దాటిన తర్వాత ఇప్పుడు ఈ సినిమా కథ నాదేనంటూ ఓ రచయిత ఆరోపిస్తున్నాడు.

 

 

2003లో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన నాగ సినిమాకు కథ అందించిన కృష్ణ అనే రచయిత అల.. కథ నాదే అంటున్నాడు. దర్శకుడు త్రివిక్రమ్ కు ఈ కథను కొన్నేళ్ల క్రితమే చెప్పానని అంటున్నాడు. కథ విన్న త్రివిక్రమ్ లైన్ బాగుందని అన్నాడని కూడా అంటున్నాడు. దాదాపు ఆరు నెలల క్రితం నా కథకు నిర్మాత కూడా దొరికాడని కానీ.. ఇలాంటి కథతోనే త్రివిక్రమ్సినిమా చేస్తున్నాడని చెప్పాడని అంటున్నాడు. అయితే ఇది నా కథే అని తాను ఊహించలేకపోయానని అంటున్నాడు. దీనిపై ఫిలిం చాంబర్ లో తన గోడు చెప్పుకుంటున్నా ఎవరూ పట్టించుకోవటం లేదని ఆరోపిస్తున్నాడు.

 

 

ఈ విషయంలో తనకు అన్యాయం జరిగిందని అంటున్నాడు. నాకు ఎవరూ సాయం చేయటం నిస్సహాయ స్థితిలో ఉన్నానని చెప్పుకుంటున్నాడు. మరి ఇంతటి విమర్శపై త్రివిక్రమ్ ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి. గతంలో కూడా త్రివిక్రమ్ చేసిన సినిమాలు అఆ.., అజ్ఞాతవాసి సినిమాలు కాపీ కథలంటూ విమర్శలు వచ్చాయి, అప్పటికి త్రివిక్రమ్ ఎన్నో విమర్శలకు గురయ్యాడు. మరి ఇప్పుడు ఎలా స్పందిస్తాడో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: