టాలీవుడ్ లో ప్రముఖ దర్శకులు రాంగోపాల్ వర్మ శిష్యుడు అజయ్ భూపతి తెరకెక్కించిన ‘ఆర్ ఎక్స్ 100’ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు కార్తికేయ.  ఈ మూవీ మొదటి నుంచి బోల్డ్ కంటెంట్ అంటూ ప్రచారం మొదలైంది. కానీ థియేటర్లో సినిమా చూసి యూత్ మాత్రం ఈ సినిమాను బాక్సాఫీస్ హిట్ చేశారు.  ఓ భగ్న ప్రేమికుడు తన ప్రేయసి చేతిలో ఎలా బలి అయ్యాడు అనే కోణంలో ఈ మూవీ తెరకెక్కింది.  గ్రామీణ వాతావరణంలో ఎంతో నేచురాలిటీకి దగ్గరగా ఈ సినిమా ఉండటం.. కార్తికేయ, పాయల్ రాజ్ పూత్ రొమాంటిక్ సీన్లు, కథ అన్ని అంశాలు సినిమా హిట్ కి కలిసి వచ్చాయి. అయితే గుణ 396, 90ఎంఎల్ సినిమాల్లో హీరోగా నటించిన కార్తికేయ ఆ మద్య విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాని హీరోగా నటించిన ‘ గ్యాంగ్ లీడర్’ సినిమాలో విలన్ గా కూడా నటించారు. 

 

ఏ పాత్రకైనా సిద్దంగా ఉంటున్న కార్తికేయ తాాజాగా  కౌశిక్ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్ని వాసు నిర్మిస్తున్న ‘చావుకబురు చల్లగా' సినిమాలో నటిస్తున్నారు.  ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ తాజాగా రిలీజ్ చేశారు.  ఈ మూవీ పూర్తిగా మాస్ ఎలిమెంట్స్ తో కామెడి, ఎమెషన్స్ అన్నీ కలగలిపినట్టు చిత్ర యూనిట్ తెలుపుతున్నారు.  ఈ సినిమాలో 'బస్తీ బాలరాజు' పాత్రలో కార్తికేయ కనిపించనున్నాడు. ఆయన లుక్ కి సంబంధించిన పోస్టర్ చూస్తుంటే మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకునేలా ఉంది.

 

శవాలను శ్మశానానికి తీసుకెళ్లే వాహనంపై నుంచుని దమ్ముకొడుతూ ఆయన కనిపిస్తున్నాడు. గళ్ల షర్టు పైకి మడిచి .. లుంగీ పైకి కట్టి  కార్తికేయ ఊరమాస్ లుక్ లో కనిపిస్తున్నారు.  ఈ సినిమాకి జాక్స్ బిజోయ్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఈ మూవీతో మరో మంచి హిట్ కొడతానన్న నమ్మకంతో కార్తికేయ ఉన్నారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: