టెలివిజన్ యాంకర్ సుమ కనకాల గురించి మన తెలుగువారికి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ముందుగా టివి ప్రపంచం అప్పుడే వృద్ధి చెందుతున్న రోజుల్లో పలు సీరియల్స్ లో నటించి, ఆపై వ్యాఖ్యాతగా కూడా వ్యవహరించిన సుమ, ఇప్పటికీ కూడా అదే జోష్ తో కొనసాగుతున్నారు. ఇక సుమ తన జీవితంలో పైకి రావడానికి కొంత ఇబ్బందులు పడ్డారు. స్వతహాగా మలయాళీ అయిన సుమ, తరువాత తెలుగు నేర్చుకుని హైదరాబాద్ వచ్చి ఇక్కడ టివి షోల్లో ఛాన్స్ సంపాదించారు. ఇక సుమ భర్త రాజీవ్ గురించి కూడా మనకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. పలువురు టాలీవుడ్, కోలీవుడ్ నటులకు శిక్షణ ఇచ్చి వారిని సినీ కెరీర్ పరంగా ఎంతో ఉన్నత స్థాయిలో నిలిపిన లక్ష్మి దేవి, దేవదాస్ కనకాల దంపతుల కుమారుడే ఈ రాజీవ్. 

 

ఇక దేవదాస్ కనకాల సినిమాల్లో నటించడంతో పాటు కొన్ని సీరియల్స్ కూడా తీశారు. అప్పట్లో మేఘమాల అనే సీరియల్ తీసే సమయంలో సుమతో రాజీవ్ కు పరిచయం ఏర్పడిందట. అయితే అంతకు ముందే ఒక సందర్భంలో ఆమెను చూసిన రాజీవ్, తొలి చూపులోనే ఆమెతో ప్రేమలో పడడం, ఎలాగైనా ఈ అమ్మాయిని ఒప్పించి వివాహం చేసుకోవాలని నిర్ణయించడం జరిగిందట. ఆ తరువాత ఇద్దరూ కలిసి పలు సీరియల్స్ లో నటించడం, అలానే వారి మధ్య అనుబంధం పెరగడం జరిగిందట. ఇక అదే సందర్భంలో రాజీవ్ కు తన పై ఉన్న ప్రేమను గ్రహించిన సుమ ఎప్పటికపుడు ఆయన కదలికలను సరదాగా గమనిస్తూ ఉండేదట. ఇక ఎట్టకేలకు ఒకరోజు రాజీవ్ తనకు ప్రేమను ప్రపోజ్ చేయడంతో, 

 

తనకు టైం కావాలని కోరిన సుమ, మూడు రోజుల తరువాత ఆయన ప్రేమను అంగీకరించారట. ఆ విధంగా కొనసాగిన వారి ప్రేమలో, ఒకానొక సమయంలో రాజీవ్ తనపై ఆధిపత్యం వహిస్తున్నారేమో అను అనుమానంతో సుమ కొన్ని నెలల పాటు ఆయనకు దూరంగా ఉన్నారట. ఇక ఆ తరువాత చివరికి అటువంటిది ఏమి లేదు నువ్వు, నీ ఇష్టాలు అంటే నాకు ఎంతో గౌరవం అని చెప్పిన రాజేవ్, ఆపై ఇరు కుటుంబీకుల పెద్దలను ఒప్పించి 1999, ఫిబ్రవరి 10న ఆమెను వివాహం చేసుకోవడం జరిగిందట. అయితే తన ప్రేమ విషయాన్ని గురించి ఎప్పుడు రాజీవ్ మాట్లాడినా, నాకు సుమను పడేయడానికి కేవలం మూడు రోజులే పట్టింది అంటూ సరదాగా చెప్తూ ఉంటారు...!! 

మరింత సమాచారం తెలుసుకోండి: