టాలీవుడ్ కి మొదటగా కథ, మాటల రచయిత గా పరిచయం అయిన త్రివిక్రమ్ శ్రీనివాస్, వేణు హీరోగా తెరకెక్కిన స్వయంవరం అనే సినిమా ద్వారా పరిచయం అవడం జరిగింది. ఆ తరువాత చిరునవ్వుతో, మన్మధుడు, మల్లీశ్వరి, నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్ వంటి సినిమాలకు కథ, మాటలు అందించి ప్రేక్షకుల నుండి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకున్నాడు. ఆ తరువాత నువ్వే నువ్వే అనే సినిమాతో దర్శకుడిగా మారిన త్రివిక్రమ్, అక్కడి నుండి వరుసగా పెద్ద స్టార్లతో సినిమాలు చేసుకుంటూ విజయాలు అందుకుంటూ ముందుకు సాగాడు. 

 

ఇక త్రివిక్రమ్ సినిమాలు చాలా వరకు మనం గమనిస్తే ఒక విషయం కొంత స్పష్టంగా అర్ధం అవుతుంది. దాదాపుగా ఆయన కథను అందించే సినిమాల్లో హీరోయిన్ కి ముందుగా ఎంగేజ్మెంట్ జరగడం, అలానే అదే సమయంలో ఏదో విధంగా ఆమెను చూసిన హీరో, ఎలాగైనా ఆమెనే పెళ్లి చేసుకోవాలని భావించడం, ఆ తరువాత ఆయా సినిమాల కథల అనుగుణంగా చివరికి హీరో, హీరోయిన్ ని గెలుచుకుని పెళ్లి చేసుకోవడం వంటివి గమనించవచ్చు. అయితే మొదట్లో ఇది కావాలని రాసుకుంది కాదని, అయితే ఆ తరువాత నుండి తాను రాసుకున్న కథల్లో కూడా హీరో

 

హీరోయిన్ కి మధ్య లింకప్ గురించి ప్రస్తావన వచ్చినపుడు ఎక్కువగా ముందుగా హీరోయిన్ కి పెళ్లి ఫిక్స్ అవ్వడం అనే ఆలోచనలు తనకు రావడంతో దాదాపుగా తన సినిమాల్లో ఆ విధంగా హీరోయిన్ ని హీరో కలుసుకుని ఫైనల్ గా చివర్లో ఆమెతో కలుస్తాడని త్రివిక్రమ్ ఇటీవల ఇంటర్వ్యూ ల్లో చెప్పడం జరిగింది. ప్రేమ అనేది మనసుకు సంబంధించింది. ప్రేమించడం అంటే మనం ఇష్టపడే వారి కోసం మనం ఏమైనా చేయడానికి సిద్ధం అవ్వడం అని చెప్పే త్రివిక్రమ్, ప్రేక్షకులు మన సినిమాకు వచ్చినపుడు వారికి అన్ని రకాల ఆనందాలు ఇవ్వాలనే ఉద్దేశ్యంతోనే అలోచించి తన సినిమా కథలు రాసుకుంటాననని అంటుంటారు.....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: