నటి షకీలా.. ఈ పేరు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఒక్కప్పుడు తన బోల్డ్ పర్ఫామెన్స్తో అంత పాపులర్ అయింది కాబట్టి. ఈ క్రమంలోనే శృంగార తారగా దక్షిణాన ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది షకీలా. అలాగే ఆమె సినిమా వస్తుందంటే.. మోహన్ లాల్, మమ్ముట్టి వంటి స్టార్స్ తమ సినిమాలను వాయిదా వేసుకునేంతలా క్రేజ్ సంపాదించుకుంది. అయితే ఒకప్పుడు టాప్ హీరోలతో సమానంగా క్రేజ్ సంపాదించిన షకీలా.. హీరోయిన్గా ఎదగాలని ఆశపడినా.. చివరికి శృంగార తారగా ఎలా మారిందో ఇప్పటికే ఆమె పలు ఇంటర్వ్యూల్లో తెలుపుతూనే ఉంటారు. ఆ తర్వాత అటువంటి సినిమాలకు పులిస్టాప్ పెట్టి మాములు సినిమాల్లో యాక్ట్ చేస్తూ వస్తోంది.
తాజాగా ఆమె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'షకీలా రాసిన మొదటి కుటుంబ కథా చిత్రం'. 24 క్రాఫ్ట్స్ బ్యానర్‌పై సీవీ రెడ్డి సమర్పణలో సీహెచ్ వెంకట్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిం చారు. సాయి రాం దాసరి దర్శకత్వ పర్యవేక్షణలో సతీష్ వి.ఎన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా షకీలా ఇంటర్వ్యూల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఆమె జీవితంలో జరిగిన పలు ఆసక్తికర విషయాలు బయటపెట్టింది. ఆమె బీ గ్రేడ్ సినిమాల్లో నటించడం వల్ల సొంత ఇంటి నుంచే ఎన్నో అవమానాలు ఎదుర్కుందట. ఆమె సొంత అన్నయ్య పెళ్లిలోనే షకీలాకు ఊహించని ఘటన ఎదురైందట. `నా సొంత అన్నయ్య పెళ్లిలోనే నాకు అవమానం జరిగింది.
నన్ను ఇంట్లో మనిషిగా కాకుండా ఏదో మూడో వ్యక్తిని పిలిచినట్లు పిలిచారు. అయినప్పటికీ పెళ్లి కదా అని వెళ్లేసరికి పెళ్లి కూతురు నన్ను చూసి అసహ్యించుకుని.. అక్కడి నుంచి వెళ్లిపోయింది. కానీ నాకు ఆ విషయం అర్థం కాలేదు. ఆ తర్వాత నేను వాష్‌రూంకు వెళ్లాను. అది గమనించి పెళ్లి కూతురు మళ్లీ స్టేజ్‌పైకి ఎక్కింది. తను వాష్రూంకి వెళ్లిందేమో అని నేను అనుకున్నాను. ఆ తర్వాత మళ్లీ నేను స్టేజ్ మీదకు వస్తుంటే.. మా అమ్మ నాన్న రావద్దు అంటూ సైగలు చేసారు. ఇంకెంత సేపు నిలబడాలి అనుకుని నేను స్టేజ్ మీదకు వెళ్లిపోయాను. దాంతో నా అన్న తన భార్య చెయ్యి పట్టుకుని నాకు దూరంగా తీసుకెళ్లి నిలబడ్డాడు.
నాకు అప్పుడు అర్థమైంది. నాకు తెలీకుండా ఏదో చేస్తున్నారని. అసలు ఏడుపు ఆగలేదు. వెంటనే పరిగెత్తుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాను` అంటూ చెప్పుకొచ్చింది ఈమె. అయితే అది జరిగిన రెండు సంవత్సరాలకు తన అన్నయ్య భర్య షకీలకు ఫోన్ చేసిందట. దీంతో షకీలా ఏంటని ఆమెను అడగగా `మీ అన్న నా నుంచి కావాల్సింది తీసుకుని నన్ను వదిలేసాడు. మీ పట్ల అలా ప్రవర్తించినందుకు నాకు తగిన శాస్తే జరిగింది. సారీ’ అని చెప్పిందట. ఇక ఆమె తప్పు తెలుసుకుంది కాబట్టి ఆమెకు సాయం చేస్తానని ధైర్యం చెప్పిందట షకీలా.