సమంత గ్యాప్ తీసుకున్నా.. అనుకోకుండా వచ్చినా.. స్టార్ హీరోతో జత కట్టి రెండేళ్లు దాటింది. లాస్ట్ టైమ్ ఏ స్టార్ తో జత కట్టిందో..మరోసారి అతని పక్కన నటిస్తోంది సామ్స్. కొంతకాలంగా పెద్ద హీరోలకు దూరంగా ఉంటున్న సమంత మరోసారి రేసులోకి దూకుతోంది. 

 

అదేమిటో గానీ..సమంతతో ఒకసారి నటిస్తే.. ఆ హీరో మళ్లీ ఈ అమ్మడినే రికమెండ్ చేస్తాడు. ఈ క్రమంలో సామ్స్ మహేశ్ తో రెండు సార్లు జతకట్టింది. ఇక ఎన్టీఆర్ తో అయితే నాలుగు సార్లు నటించింది. కెరీర్ స్టార్ట్ చేసిన ఎనిమిదేళ్ల తర్వాత కాస్త లేటైనా.. రంగస్థలంలో రామ్ చరణ్ జత కట్టింది. ఇద్దరూ బెస్ట్ పెర్ ఫార్మెన్స్ తో మంచి పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడీ కాంబినేషన్ రిపీట్ అవుతోందని సమాచారం. 

 

రంగస్థలం తర్వాత సామ్స్ స్టార్ హీరోతో జత కట్టలేదు. మహానటిలో ఇంపార్టెంట్ రోల్ పోషించి.. యూటర్న్ తో కథానాయిక ప్రాధాన్యమున్న చిత్రాలు చేయడం స్టార్ట్ చేసింది. మరో లేడీ ఓరియెంటెడ్ మూవీ బేబీతో మెప్పించింది. మజిలీ మూవీలో కలిసొచ్చిన నాగచైతన్యతో నటించి మరో హిట్ అందుకుంది సమంత. 

 

లేడీ ఓరియెంటెడ్ మూవీస్ తో బిజీగా గడిపేసిన సమంత.. స్టార్స్ కు దూరమైంది. రీసెంట్ గా రిలీజైన జాను తర్వాత సమంత నటించే సినిమా రామ్ చరణ్ దే కావచ్చు. చిరంజీవి, కొరటాల సినిమాలో రామ్ చరణ్ చిన్నప్పటి మెగాస్టార్ గా నటిస్తాడట.

 

అరగంటసేపు సాగే ఈ పాత్రకు హీరోయిన్ కూడా ఉందట. ముందుగా కియారా ఆద్వానీ అనుకున్నారు. అయితే సమంత అయితే బాగుంటుందని దర్శకుడు భావించాడట. మరి సమంత గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో లేదో చూడాలి. ఒక వేళ ఒకే అంటే..జనతా గ్యారేజ్ తర్వాత కొరటాల దర్శకత్వంలో సమంతకు ఇది రెండో సినిమా.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: