టాలీవుడ్ లో నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో స్వర్గీయ నందమూరి హరికృష్ణ తనయుడు జూ.ఎన్టీఆర్ ప్రస్తుతం నెంబర్ వన్ రేస్ లో కొనసాగుతున్నారు.   సినియర్ ఎన్టీఆర్ నటించిన బ్రహ్మర్షి విశ్వామిత్రం సినిమాలో బాలనటుడిగా పరిచయం అయిన ఎన్టీఆర్ తర్వాత బాల రామాయణంలో రాముడిగా నటించి అందరి ప్రశంసలు అందుకున్నారు.   తర్వాత 2001 లో నిన్ను చూడాలని సినిమాతో హీరోగా పరిచయం అయిన ఎన్టీఆర్ ప్రముఖ దర్శకులు రాజమౌళి తెరకెక్కించిన ‘స్టూడెంట్ నెం.1’ సినిమాతో మంచి విజయం అందుకున్నాడు.  ఈ మూవీ రాజమౌళికి మొదటి సినిమా కావడం విశేషం. ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా స్టూడెంట్ నెం.1 బిగ్గెస్ట్ హిట్ తర్వాత సింహాద్రి, యమదొంగ బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి.  ప్రస్తుతం రాజమౌళి, ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఆర్ఆర్ఆర్ మూవీ తెరకెక్కుతుంది.  టాలీవుడ్ లో ఎన్టీఆర్ నటనకు మాత్రమే కాదు.. క్యారెక్టర్ పరంగా కూడా ఎంతో మంచి పేరు సంపాదించారు.  


తన అభిమానుల విషయంలో ఎన్టీఆర్ ఎలా స్పందిస్తారో పలుమార్లు వార్తల్లో వచ్చాయి.  తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ తో కలిసి పలు సినిమాల్లో నటించిన నటుడు చత్రపతి శేఖర్ పలు విషయాలు ఆయన గురించి వెల్లడించారు.   నా కెరీర్ మొదట టివి సీరియల్స్ తో మొదలైంది.. ప్రస్తుతం టివి సీరియల్స్ కంటిన్యూ చేస్తున్నాను.  నాకు వెండి తెరపై చిన్న చిన్న అవకాశాలు వచ్చాయి.. అయితే రాజమౌళి తెరకెక్కించిన ‘చత్రపతి’ తన కెరీర్ లో ఎంతో మంచి గుర్తింపు తెచ్చిందన్నారు.  ఇప్పుడు ఆ పేరుతోనే తనను పిలుస్తారని అన్నారు.


 నేను ఎన్టీఆర్ తో కలిసి ఓ 6 సినిమాల వరకూ చేశాను. సెట్లో ఉన్నంతసేపు ఆయన నవ్విస్తూనే ఉంటాడు. ఎన్టీఆర్ కంటూ ఒక స్టైల్ వుంది .. ఒక ప్రత్యేకమైన డైలాగ్ డెలివరీ వుంది. ఎంత పెద్ద డైలాగ్ అయినా ఒకసారి చూసేసి చెప్పే జ్ఞాపక శక్తి వుంది.  నటన పరంగానే కాదు ఎంతో ఉదార స్వభావం కల వ్యక్తి అన్నారు.  చిరంజీవి తరువాత నేను ఎక్కువగా ఇష్టపడే హీరో ఎన్టీఆరే అని చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: