ప్రతి పాత్రలోనూ నట విశ్వరూపం చూపిస్తూ ఎంతోమంది తెలుగు ప్రేక్షకుల ఆదరాభిమానాలు చూరగొంటున్న హీరో జూనియర్ ఎన్టీఆర్. నందమూరి ఫ్యామిలీ నుంచి చిత్ర పరిశ్రమకు పరిచయమైన జూనియర్ ఎన్టీఆర్ ఆ తర్వాత తాతకు తగ్గ మనవడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే తెలుగు ప్రేక్షకులందరూ జూనియర్ ఎన్టీఆర్ కు తాత సీనియర్ ఎన్టీఆర్ చరీష్మా  ఉంది అని నమ్ముతారు. ఇదిలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ ఎలాంటి పాత్రలో చేసిన ఆ పాత్రకు ప్రాణం పోసినట్లుగా  నటిస్తూ ఉంటారు అనే విషయం తెలిసిందే. ఎలాంటి పాత్రలో నటించిన జూనియర్ ఎన్టీఆర్ నటనకు ఫిదా అవ్వని ప్రేక్షకుడు లేడంటే అతిశయోక్తి కాదు. తన అద్భుతమైన నటనతో... పాత్రలో ఒదిగిపోయి మరి నటిస్తూ ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్నారు జూనియర్ ఎన్టీఆర్.

 


 ఇక ప్రతి పాత్రలో  ఆయన నట విశ్వరూపం చూపిస్తూ... నటన అంటే ఇలా ఉంటుంది అని  ప్రతిసారి నిరూపిస్తూ నే ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్. ప్రతి పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తూ... మంచి విజయాలను కూడా అందుకుంటున్నారు. అయితే ఎన్టీఆర్ మంచి నటుడు అన్న విషయం తెలిసిందే  తాజాగా ఇదే విషయాన్ని నటుడు శేఖర్ ఓ ఇంటర్వ్యూ లో తెలిపారు. ఇండస్ట్రీలో తనదైన నటనతో పలు వైవిధ్యమైన పాత్రలలో నటిస్తూనే మరోవైపు సీరియల్స్లో కూడా నటిస్తూ కెరీర్ను కొనసాగిస్తున్నారు శేఖర్. చత్రపతి సినిమాలో ప్రభాస్ చిన్నప్పటి ఫ్రెండ్ గా నటించి తన నటనకు ఎన్నో ప్రశంసలు అందుకుని తర్వాత చత్రపతి శేఖర్ గా మారిపోయాడు.

 


 అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూ కి హాజరైన చత్రపతి శేఖర్... జూనియర్ ఎన్టీఆర్ నటన గురించి ఆయన ఆటిట్యూడ్ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేను ఎన్టీఆర్ తో కలిసి ఆరు సినిమాలు చేశాను... సెట్లో ఉన్నంతసేపు జూనియర్ ఎన్టీఆర్ అందరినీ నవ్విస్తూ నే ఉంటారు... జూనియర్ ఎన్టీఆర్ కంటూ ప్రత్యేకమైన స్టైల్  ఉంది... ఒక ప్రత్యేకమైన డైలాగ్ డెలివరీ ఉంది. ఎంత పెద్ద డైలాగ్ అయినా సరే జూనియర్ ఎన్టీఆర్ ఒక్కసారి చూసుకున్నారూ  అంటే ఎక్కడ తడబడకుండా చెబుతూ ఉంటారు. అంతటి జ్ఞాపక శక్తి జూనియర్ ఎన్టీఆర్ సొంతం. ఎలాంటి పాత్రలోనైనా పూర్తిగా లీనమై నటిస్తూ ఉంటాడు జూనియర్ ఎన్టీఆర్. హీరో జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో  సినిమాలు చేయడం అంటే తనకు ఎంతో ఇష్టం అంటూ చెప్పుకొచ్చారు నటుడు చత్రపతి శేఖర్. ఇండస్ట్రీలో తనకు చిరంజీవి గారు ఎంతో ఇష్టమని ఇక చిరంజీవి గారి తర్వాత ఎక్కువగా ఇష్టపడే హీరో ఎన్టీఆర్ మాత్రమే అంటూ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: