రేపు విడుదల కాబోతున్న ‘వరల్డ్ ఫేమస్ లవర్’ మూవీ ప్రమోషన్ కు ఎన్ని మార్గాలు ఉంటాయో అన్ని మార్గాలు విజయ్ దేవరకొండ అనుసరిస్తున్నాడు. ప్రస్తుతసం ఉన్న పోటీ వాతావరణంలో ఏదైనా కొత్తగా చేస్తేనే ప్రచారంలో దూసుకెళ్లడం సాధ్యం కాబట్టి దేవరకొండ ప్రచారంలో కొత్తదనాన్ని  తన లేటెస్ట్ సినిమా విషయంలో అనుసరిస్తున్నాడు.    


నిన్న ‘వరల్డ్ ఫేమస్ లవర్’ ప్రీ రిలీజ్ వేడుక వైజాగ్ లో జరిగింది. ఈ ఈవెంట్ కు విజయ్ పంచె కట్టుతో వచ్చి తన మాస్ లుక్ ను బయటపెట్టాడు. అయితే ఈ డీగ్లామర్ స్టయిల్ కొందరికి నచ్చితే మరికొందరికి నచ్చలేదు. ఆ క్రమంలోనే  విజయ్ పై విపరీతంగా  ట్రోల్ జరుగుతోంది. 


ఇదేం లుంగీ కట్టురా బాబోయ్ అని కొందరు తిట్టేస్తుంటే మరీ ఇంత విచిత్రం అవసరమా అంటూ మరికొందరు జోక్ చేస్తున్నారు. నిన్న సాయంత్రం విశాఖనగరంలో యూత్ కు జోష్ ఇవ్వడానికి ప్రయత్నించిన విజయ్ లుక్ అతడి గెటప్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా అతడి లుంగీ కట్టు తలపాగా మాస్ ఎక్స్ ప్రెషన్ ని వర్ణిస్తూ కొందరు ట్రోల్  చేస్తున్నారు.  


ఈ ట్రోలింగ్ ఇలా కొనసాగుతూ ఉండగానే మరికొందరు ఈ అతిని తగ్గించమని విజయ్ కి సలహా ఇస్తున్నారు.  రేపు   ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజును టార్గెట్ చేస్తూ విడుదలకాబోతున్న ఈమూవీకి క్రేజ్ తెప్పించాలని విజయ్ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఈ మూవీకి ఇంకా మ్యానియా ఏర్పడక పోవడం విజయ్ ని భయ పెడుతున్నట్లు టాక్. ఈ మూవీకి వచ్చే ఓపెనింగ్ కలెక్షన్స్ బట్టి విజయ్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉంది అన్న విషయమై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సంక్రాంతి సినిమాల మ్యానియా తరువాత ఎన్ని సినిమాలు రిలీజ్ అయినా రియల్ హిట్ పడని నేపధ్యంలో ఈ ‘వరల్డ్ ఫేమస్ లవర్’ అదృష్టం రేపు తేలిపోతుంది.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: