చిత్రలహరి సినిమాతో సూపర్ ఫాం లోకి వచ్చిన సాయి తేజ్ ఈమధ్య వచ్చిన ప్రతిరోజూ పండుగే సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం సాయి తేజ్ హీరోగా నూతన దర్శకుడు సుబ్బు డైరక్షన్ లో వస్తున్న సినిమా సోలో బ్రతుకే సో బెటర్. ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ సినిమాకు సంబందించిన స్లోగన్ రిలీజ్ రిలీజ్ చేశారు చిత్రయూనిట్. కోపం ఇష్టం విచారం సంతోషం ఆనదం బాధ ఇవన్ని కాలంతో పాటు కారణాలతో పాటు మారిపోయే ఫీలింగ్స్.. మరి ప్రేమనేది ఒక ఫీలింగే కదా మారదని గ్యారెంటీ ఏంటి..? మన గోల్ ఏంటి.? మన ఎజెండా ఏంటి..? ఫైనల్లీ మన ఎజెండా ఏంటి..? అంటూ సాయి తేజ్ అనగా సోలో బ్రతుకే సో బెటర్ అనేస్తారు.

 

ఇదే ఈ వాలెంటైన్స్ డేకి సోలో బ్రతుకే సో బెటర్ టీం ఇచ్చిన సర్ ప్రైజ్ గిఫ్ట్. కొన్నాళ్లుగా హిట్ కోసం తపించిన మెగా హీరో ఇప్పుడు సరైన ట్రాక్ లో ఉన్నాడని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ సింగిల్ యాంతం లో అదేనండి సోలో బ్రతుకే సో బెటర్ థీం వీడియోలో సాయి తేజ్ లుక్ అదిరింది. రఫ్ లుక్ లో కనిపిస్తూ రఫ్ఫాడించేందుకు రెడీ అవుతున్న ఈ మెగా మేనళ్లుడుకి మళ్లీ మంచి రోజులు వచ్చాయని అనిపిస్తుంది.

 

ఎవరైనా ప్రేమికుల రోజు సినిమాలోని సాంగ్స్ ను రిలీజ్ చేస్తారు.. లేక హీరో హీరోయిన్ పోస్టర్స్ తో విష్ చేస్తారు. కాని ఇవేవి నచ్చని సోలో మనిషి ఏం చేస్తాడు. ఇదిగో ఇలానే ఓ స్లోగన్ తో వచ్చేస్తాడు. సోలో బ్రతుకే సో బెటర్ స్లోగన్ తో సోలోగా.. ఫ్రీడం గా బ్రతికేయడమే హక్కుగా భావించే వారందరికి సాయి తేజ్ సపోర్ట్ గా ఉంటాడని చెప్పొచ్చు. శ్రీ వెంకటేశ్వర సిని చిత్ర బ్యానర్ లో బోగవల్లి ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: