జబర్దస్త్ షో ద్వారా పాపులర్ అయిన రష్మి, సుధీర్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ సూపర్ సక్సెస్.. ఐదారేళ్లుగా బుల్లితెర క్రేజీ కపుల్ గా వీరిద్దర్ జోరుకి బ్రేకులేసేలా ఉన్నారు కొత్త క్రేజీ కపుల్. అదేంటి సుధీర్, రష్మిలను పడగొట్టే రేంజ్ లో కెమిస్ట్రీ వర్క్ అవుట్ అయ్యే జంట ఉందా అంటే ఇంతకీ వాళ్లెవరో అంటే ఇంకెవరు హైపర్ ఆది, వర్షిణిలే అంటున్నారు. జబర్దస్త్ లోనే తన పంచుల ప్రవాహంతో తెలుగు రెండు రాష్ట్రాల్లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న హైపర్ ఆది వరుసగా ఆఫర్లు అందుకుంటున్నాడు.

 

ఢీ చాంపియన్స్ లో టీం లీడర్ గా ఎంట్రీ ఇచ్చిన హైపర్ ఆది అక్కడ తనకు జోడీగా వచ్చిన మరో టీం లీడర్ వర్షిణితో ప్రేమపాఠాలు నేర్చుకుంటున్నాడు. కేవలం డ్యాన్స్ చూపిస్తేనే షో బోర్ కొడుతుందని అనుకున్నారో ఏమో దీనిలో కూడా కామెడీని మిక్స్ చేసి కొడుతున్నారు. సుధీర్, రష్మిల మధ్య లవ్ గేం అందరికి తెలిసిందే. కొన్నాళ్లుగా రష్మి వెంట సుధీర్ పడటం ఆమె కాదనడం కామన్ అయ్యింది. రష్మి చీ.. పో.. అని చీదరించుకున్నా ఆమె వెంట పడటం మాత్రం మానడు సుధీర్.

 

అయితే వీరి జంట ఇప్పుడు బోర్ కొట్టిందని భావించిన షో నిర్వాహకులు. కొత్తగ హైపర్ ఆది, వర్షిణిల మీద ద్రుష్టి పెట్టినట్టు అనిపిస్తుంది. ప్రతి బుధవారం వచ్చే ఢీ ఛాంపియన్ షోలో ఓ పక్క రష్మికి లైన్ వేస్తూ సుధీర్, వర్షిణిని లైన్ లో పడేయాలని హైపర్ ఆది విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇక వచ్చే వారం ఎపిసోడ్ ప్రోమోలో ఓ రొమాంటిక్ సాంగ్ లో ఆది, వర్షిణిలు నిజంగా ప్రేమికుల మాదిరిగా రెచ్చిపోయారు. అది చూసిన వారంతా ఆది వర్షిణి ఆన్ స్క్రీన్ లోనే కాదు ఆఫ్ స్క్రీన్ లో కూడా ఏదో జరుగుతుందని భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: