ఇప్పట్లో ఆ దర్శకుడికి క్రేజ్ లేదు కానీ.. అప్పట్లో మాస్  సినిమాలు తెలుగు చిత్ర పరిశ్రమను ఏలుతున్న సమయంలో.. ఆ దర్శకుడికి  క్రేజే వేరు. స్టార్ హీరోలతో వరుస సినిమాలు చేస్తూ భారీ విజయాలను అందుకున్నారు ఆ దర్శకుడు. ఆ తర్వాత ఒక్క సినిమాతో తాను సంపాదించుకున్న క్రేజ్ మొత్తం నాశనమైపోయింది. ఇక ఆ తర్వాత తెర మీద ఎక్కడా కనిపించలేదు ఆ  దర్శకుడు.ఇంతకీ  నేను చెప్పేది ఏ దర్శకుడి గురించా  అనుకుంటున్నారా...మాస్  చిత్రాలకు యాక్షన్ చిత్రాలకు పెట్టింది పేరుగా ఉండే దర్శకుడు బి.గోపాల్. ఈ దర్శకుడు తెరకెక్కించిన యాక్షన్ సినిమాలు అన్నీ తెలుగు చిత్రపరిశ్రమలోనే భారీ విజయాల్ని సొంతం చేసుకొన్నాయి. లారీ డ్రైవర్,  రౌడీ ఇన్స్పెక్టర్,  సమరసింహా రెడ్డినరసింహ నాయుడు,  ఇంద్ర ఇలా  ఎన్నో చిత్రాలు ఇండస్ట్రీ హిట్స్ గా నిలిచాయి. ఇలాంటి భారీ విజయాలను సొంతం చేసుకున్న దర్శకుడు బి.గోపాల్ కొన్ని సినిమాల వల్ల కెరియర్ మొత్తం నాశనం చేసుకున్నాడు.

 

 

అప్పటి  వరకు ఎన్నో ఫ్యాక్షన్ చిత్రాలను తెరకెక్కించే భారీ విజయాలను సొంతం చేసుకున్నప్పటికీ ఆ తర్వాత తెరకెక్కించిన కొన్ని సినిమాల వల్ల మాత్రం ఆయన కెరీర్ మొత్తం నాశనం అయిపోయింది. బి.గోపాల్ లాంటి ఫ్యాక్షన్  దర్శకుడి కెరియర్  నాశనం అవ్వడానికి ముఖ్య  సినిమా ఏది అంటే పలనాటి బ్రహ్మనాయుడు. ఈ సినిమా ఫ్లాప్ కావడం అప్పుడు వరకు బి.గోపాల్ తెచ్చుకున్న పేరు మొత్తం నాశనమైపోయింది. బాలకృష్ణ హీరోగా నటించిన పలనాటి బ్రహ్మనాయుడు సినిమాలు ఏ రేంజ్ లో అతి ఉంటుందో అందరికీ తెలిసిన విషయం. ఇదే సినిమా కనుక ఇప్పుడు విడుదల అయి ఉంటే సినిమాలోని ప్రతి సీన్ కి ట్రోల్స్ వచ్చేది. ఈ సినిమాలో బాలకృష్ణ తొడగొడితే రైలు ఆగడం వెనక్కి వెళ్లిపోవడం... కోడి కత్తి కట్టి మనిషిని చంపడం... ఇలాంటి సీన్స్  పల్నాటి బ్రహ్మ నాయుడు సినిమాలో అడుగడుగునా కనిపిస్తాయి.దీంతో  సినిమా చూసిన ప్రేక్షకులు అందరూ చిర్రెత్తిపోయారు. దీంతో ఈ సినిమా ఫ్లాప్ గానే మిగిలిపోయింది. 

 

 

 బాలకృష్ణ తో ఏం చేసినా నడుస్తుందని బి.గోపాల్ అలా చేసినప్పటికీ సీన్  కాస్త రివర్స్ అయ్యి  కెరియర్ నాశనమైంది.అయితే తాజాగా  ఈటీవీలో ప్రసారమయ్యే ఆలీతో సరదాగా కార్యక్రమంలో దర్శకుడు బి.గోపాల్ పాల్గొన్నారు. పల్నాటి బ్రహ్మ నాయుడు సినిమా గురించి ప్రస్తావన రావడంతో... సినిమాలో తొడగొడితే ట్రైన్ ఆగే  సీన్ పెట్టకుండా ఉండాల్సింది అని తెలిపారు. ఆ సీన్  కోసం ఇప్పటికీ బాధ పడుతూనే ఉంటాను అంటూ చెప్పుకొచ్చారు ఆయన. ఆ సీన్ సినిమా లో పెట్టి తప్పు చేశాను అనే భావన ఇప్పటికీ ఉందని ఆ సినిమా ఫ్లాప్ కి నాదే పూర్తి బాధ్యత అంటూ దర్శకుడు బి.గోపాల్ చెప్పుకొచ్చారు. ఎన్నో అంచనాల మధ్య తెరకెక్కిన ఈ సినిమా ఫ్లాప్ కావడంతో అటు బాలయ్య తో పాటు ఇటు దర్శకుడు గోపాల్ కెరీర్పై ఎంతగానో ప్రభావం చూపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: