మూడు పదుల వయసు దాటేసినా సరే స్టార్ హీరోయిన్ గా  కుర్ర హీరోయిన్లకు పోటీగా చిత్ర పరిశ్రమను దున్నేస్తుంది నయనతార. తనకు డిమాండ్ ఉండటంతో దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని భావిస్తుంది ఈ సీనియర్ హీరోయిన్. మధ్యలో ప్రేమ వ్యవహారాలతో కాస్త కెరీర్ ని ఇబ్బంది పెట్టుకున్న నయన్ ఇప్పుడు వాటిని పక్కనబెట్టి ఆ సోది వద్దులే అంటుంది. శరవేగంగా సినిమాలు చేస్తుంది. అలా అని ఏ సినిమా పడితే ఆ సినిమా చేయడానికి ఇష్టపడటం లేదు ఈ హీరోయిన్. సెలెక్టివ్ కథలతో దూసుకుపోతుంది.  

 

అంత వరకు బాగానే ఉంది గాని ఈ మధ్య నయన్ ని ఆమె ఫాన్స్ ఎక్కువగా చీరలోనే చూస్తున్నారు. ఎక్కువగా చీర లేకపోతే చుడిదార్ మాత్రమే ధరిస్తుంది ఈ సీనియర్ హీరోయిన్. దానికి కారణం ఏంటీ అని సిని పరిశీలకులను ఎవరిని అయినా అడిగితే, వయసు మీద పడుతుంది కదా చూపించడానికి అంతగా ఇష్టపడటంలేదని అంటున్నారు. కెరీర్ మొదట్లో, దుబాయ్ శీను, గజినీ, అదుర్స్ వంటి సినిమాల్లో పొట్టి పొట్టి దుస్తులు వేసి, చెమటలు పట్టించిన ఈ కేరళ భామ ఆ తర్వాత క్రమంగా మంచి కథలతో సినిమాలు చేయడం మొదలుపెట్టి సాంప్రదాయాన్ని పరిచయం చేసింది. 

 

ఇప్పుడు మళ్ళీ పొట్టి దుస్తుల్లోకి వెళ్ళిపోతా అంటుంది నయనతార. రాబోయే సినిమాల్లో నాకు చీర వద్దు, బికినీలు కావాలని అడుగుతుంది. త్వరలో చేయబోయే చిత్రాల్లో నేను ఆంటీలా చీరలో ఉండను, అలా అయితే కుర్ర హీరోయిన్లు తనకు పోటీ వస్తారని భావించిన ఆమె, చీరకు, పంజాబీ డ్రెస్ కి స్వస్తి చెప్పి పొట్టి దుస్తుల్లో మారే ఆలోచన చేస్తుంది. ప్రస్తుతం రజని కాంత్ హీరోగా ఒక సినిమా చేస్తుంది. విజయ్ సేతుపతి హీరోగా కూడా ఒక సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాల్లో ఎక్కువగా తన గ్లామర్ ని చూపించడానికి ఇష్టపడుతుంది ఈ భామ. 

మరింత సమాచారం తెలుసుకోండి: