ఈ మద్య డేటింగ్ కల్చర్ బాగా పెరిగిపోయింది.  ఒకప్పుడు పాశ్చాత్య దేశాలకు మాత్రమే పరిమితం అయిన ఈ కల్చర్ ఇప్పుడు భారత దేశంలో కూడా ఎక్కువైంది.  ముఖ్యంగా బాలీవుడ్ లో ఈ మద్య డేటింగ్ కల్చర్ సర్వ సాధారణం అయ్యింది.    డేటింగ్ అంటే పెళ్లికి ముందు కలుసుకొని తర్వాత ఇష్టమైతే పెళ్లి చేసుకోవడం లేదా విడిపోడం అన్నమాట. చాలా మంది సహజీవనం చేసిన వారు విడిపోయిన సంఘటనలే ఎక్కువగా ఉన్నాయి.  కలిసి సహజీవనం చేసి పెళ్లి చేసుకున్న వారు చాలా తక్కువ మందే అని చెప్పొచ్చు.  అయితే సినీ పరిశ్రమలో ఎప్పటి నుంచి సహజీవనం సాంప్రదాయం ఉంది.. చాలా మంది సీనీ నటులు సహజీవనం చేసిన వారే.. అయితే కొంత మంది మాత్రం పెళ్లి చేసుకొని సంసారం కొనసాగిస్తున్నారు. 

 

మరికొంత మంది చాలా కాలం కలిసి ఉండి తర్వాత విడిపోయారు.  కమల్ హాసన్, గౌతమి దాదాపు పదమూడేళ్లు సహజీవనం చేసి విడిపోయిన విషయం తెలిసిందే.  ఆ మద్య సహజీవనం గురించి రాధికా ఆప్టే సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.  ఇద్దరకి ఇష్టమై కలిసి ఉంటే తప్పు ఏమాత్రం లేదని.. ఇప్పుడు ఎవరి జీవితం వారు ఆనందంగా గడుపుతున్నారని.. అలాంటపుడు కలిసి ఉంటే తప్పే లేదు అని అన్నారు.  డేటింగ్ కల్చర్ పై మరికొంత మంది హీరోయిన్లు సైతం ఇదే అభిప్రాయం వెలుబుచ్చారు.  తాజాగా తాజాగా ఈ జాబితాలో 'భరత్ అనే నేను' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కైరా అద్వానీ కూడా చేరింది.

 

ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీగా ఉన్న ఈ అమ్మడు... పెళ్లికి ముందు డేటింగ్ చేసినా ఎలాంటి తప్పు లేదు అంటూ సంచలన ప్రకటన చేసింది. పెళ్లికి ముందు ఇద్దరికి నచ్చితే కొంత కాలం కలిసి ఉంటే తప్పేముందని ప్రశ్నిస్తుంది ఈ చిన్నది.  కరినొకరు అర్థం చేసుకోవడానికి ఇది తోడ్పడుతుందని, ఒకరిని విడిచి మరొకరం ఉండలేమనే నిర్ణయానికి వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోవచ్చని తెలిపింది. అయితే, తాను మాత్రం ఎలాంటి రిలేషన్ షిప్ లో లేనని అంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: