రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత టాలీవుడ్‌లో చాలా మార్పులు వ‌స్తున్నాయి. ఇండ‌స్ట్రీ అంతా హైద‌రాబాద్ లో కేంద్రీకృత‌మై ఉండ‌డంతో ఎవ్వ‌రూ కూడా తెలంగాణ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నోరు మెదిపే ప‌రిస్థితి లేద‌న్న‌ది మాత్రం వాస్త‌వం. ఇండ‌స్ట్రీలో చాలా మంది జ‌నాలు, న‌టీన‌టులు ఏపీలో రాజ‌కీయాల గురించే పాజిటివ్‌, నెగిటివ్ గా ఎక్కువుగా కామెంట్లు చేస్తూ ఉంటారు. అయితే తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్ గురించి నెగిటివ్ గా కామెంట్ చేసేంత ధైర్యం మాత్రం ఎవ్వ‌రికి లేద‌న్న‌ది నిజం. 

 

ఇక తాజాగా కేసీఆర్ తెలంగాణ‌లో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ సమీపంలో అంతర్జాతీయ స్థాయిలో ఫిలిం ఇన్ స్టిట్యూట్ ఏర్పాటు చేసేందుకు ప్ర‌య‌త్నాలు ప్రారంభించారు. దీని ఏర్పాటు కోస‌మే తెలంగాణ సినిమాటోగ్ర‌ఫీ మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ ఐదు రోజుల వ్య‌వ‌ధిలో తెలుగు సినిమా స్టార్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున‌తో భేటీ అయ్యి చాలా సేపే చ‌ర్చ‌లు జ‌రిపారు.

 

ఈ చ‌ర్చ‌ల్లో ద‌గ్గుబాటి, నంద‌మూరి ఫ్యామిలీ హీరోలు మాత్రం ఎక్క‌డా లేరు. కేవలం చిరంజీవి, నాగార్జునతో మాత్రమే మంత్రి srinivas YADAV' target='_blank' title='తలసాని శ్రీనివాస్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>తలసాని శ్రీనివాస్ యాదవ్ మంతనాలు జరుపుతున్నారు. ఈ స‌మావేశాల్లో అస‌లు ద‌గ్గుబాటి, నంద‌మూరి హీరోల ప్ర‌స్తావ‌నే లేదు. ఇక సురేష్ బాబు  చాలా తెలివిగా న్యూట్ర‌ల్ గా ఉండేందుకే మొగ్గు చూపుతార‌న్న టాక్ ఉంది.

 

అందుకే ఈ విష‌యంలో ఆయ‌న్ను కూడా ప‌ట్టించుకోలేదు. కేవలం చిరంజీవి, నాగార్జునతోనే అన్నీ మాట్లాడేసుకుని నిర్ణయాన్ని వెలిబుచ్చారు. ఏదేమైనా ఈ కీల‌క ప్రాజెక్టు విష‌యంలో అటు కేసీఆర్‌కు అత్యంత స‌న్నిహితుడు అయిన రామోజీరావుతో పాటు నందమూరి , ద‌గ్గుబాటి అన్న బ్రాండ్లు ద‌రి చేర‌నివ్వ‌లేదు. దీనిని బ‌ట్టి టాలీవుడ్‌లో ద‌గ్గుబాటి, నంద‌మూరి బ్రాండ్ల‌ను చెరిపివేయ‌డం లేదా.. తెలంగాణ వీళ్ల ప్రాధాన్య‌త‌ను త‌గ్గించేందుకే కేసీఆర్ ఇలా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారా ? అన్న సందేహాలు అయితే చాలా మందిలో వ‌స్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: