టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ముందుగా బాలనటుడిగా నీడ అనే సినిమా ద్వారా తెలుగు సినిమా పరిశ్రమకు తండ్రి కృష్ణ నటవారసత్వంతో అడుగుపెట్టడం జరిగింది. అయితే చిన్న వయసులోనే ఆకట్టుకునే నటనతో ప్రేక్షకుల నుండి మంచి పేరు సంపాదించిన మహేష్, బాలచంద్రుడు సినిమా తరువాత సినిమాలకు విరామం పలకడం జరిగింది. ఆపై కొన్నేళ్ల గ్యాప్ తరువాత రాజకుమారుడు అనే సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చిన ప్రిన్స్ మహేష్, తొలి సినిమాతోనే సూపర్ డూపర్ హిట్ ని దక్కించుకున్నారు. ఇక ఆ తరువాత నుండి ఒక్కొక్కటిగా అవకాశాలు అందుకున్న మహేష్, తండ్రి కృష్ణకు తగ్గ తనయుడిగా ఆ తరువాత పలు విజయవంతమైన సినిమాలతో దూసుకుపోయారు. 

 

ఇక మధ్యలో ఆయనకు కొన్ని ఫ్లాప్స్ కూడా ఎదురయ్యాయి. ఇక 2000వ సంవత్సరంలో తండ్రి కృష్ణ తో కలిసి మహేష్ నటించిన వంశీ సినిమాలో ఆయనకు జోడిగా నటించిన నమ్రతను ప్రేమించి మరీ 2005లో సూపర్ స్టార్ మహేష్ వివాహం చేసుకున్నారు. ఇక ప్రస్తుతం వారికి గౌతమ్, సితార ఇద్దరు బిడ్డలు. మొదటి నుండి తన సినిమాలతో పాటు ఫ్యామిలీతో ఎక్కువగా గడిపే మహేష్ బాబు లైఫ్ గురించి ఇటీవల నమ్రత ఒక ఆసక్తికరమైన సీక్రెట్ ని ఆమె సన్నిహితులవద్ద బయటపెట్టారట. అదేమిటంటే, మహేష్ కి నేను మాత్రమే కాదు, ఆయనకు రెండవ భార్య కూడా ఉందని అన్నారట నమ్రత. 

 

అయితే ఆమె మాటతో ఒక్కసారిగా వారందరు ఖంగు తిని, ఇంతకీ ఆమె ఎవరు, ఎవరు అంటూ అడగసాగారట. అయితే వారి ఆసక్తిని చూసి కొంత ఆశ్చర్యపోయిన నమ్రత, ఇంకెవరు ఆయన నటిస్తున్న సినిమాలే ఆయనకు రెండవ భార్య. ఇటు నేను, అటు సినిమాలు, మా ఇద్డరు భార్యల్లో ఏ ఒక్కరు లేకపోయినా ఆయన ఉండలేరు అని ఆమె చెప్పిన మాటతో ఒక్కసారిగా వారందరూ పగలబడి నవ్వారట. కాగా ఈ వార్త ఆమె సన్నిహితులు కొందరి నుండి బయటకు రావడంతో ప్రస్తుతం ఈ న్యూస్ పలు ఫిలిం నగర్ వర్గాల్లో ఎంతో ఆసక్తికరంగా వైరల్ అవుతోంది....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: