వర్ధమాన నటి శ్రీరెడ్డి ఇటీవల కొద్దిరోజుల క్రితం తన మకాం ని చెన్నైకి మార్చిన విషయం తెలిసిందే. అయినప్పటికీ కూడా ఇప్పటికీ కొందరు సినీ, రాజకీయ ప్రముఖులను తన మార్క్ పదజాలంతో అందుకుంటూనే ఉంది. కొన్నాళ్ల క్రితం, టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ ఉందని, కొందరు సినిమా కో ఆర్డినేటర్లు, మేనేజర్లు, ఇక్కడికి కొత్తగా అవకాశాల కోసం వస్తున్న అమ్మాయిలను మోసం చేసి వారిని పలు రకాలుగా లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారని శ్రీరెడ్డి ఆరోపించింది. 

 

అలానే ఇకపై ఆడవారి కోసం ప్రత్యేకంగా మా అసోసియేషన్ లో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసి ఇటువంటి చర్యలు జరుగకుండా చూడాలని కోరుతూ శ్రీరెడ్డి మా అసోసియేషన్ ముందు అర్ధనగ్న ప్రదర్శన కూడా చేసింది. ఆ తరువాత దిగివచ్చిన మా అసోసియేషన్ వారు అందుకు ఒప్పుకున్నారు. ఆ ఘటనతో ఎంతో పాపులరైన శ్రీరెడ్డి, తన మార్గాన్ని ప్రక్క దారి పట్టించి టాలీవుడ్ స్టార్ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసి ఆయన ఫ్యాన్స్ ఆగ్రహానికి కూడా గురైంది. ఇక ఇప్పటికీ కూడా ఆమె చేస్తున్న విమర్శలపై కొందరు నెటిజన్లు ఆమెపై విరుచుకుపడుతూనే ఉన్నారు కూడా. 

 

ఇక లేటెస్ట్ గా నిన్న మరొక్కసారి విరుచుకుపడుతూ ఆమె చేసిన ఒక పోస్ట్ ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతోంది. నిన్ను చూస్తే జాలి వేస్తోంది, నేను కనుక నా బూతు పంచాంగం విప్పితే అది తట్టుకోలేక మీ పూర్వీకులు వచ్చి నాకు సారీ చెప్పాలి, అంటూ పలు విధాలుగా వినలేని కఠోరమైన బూతులు తిడుతూ పోస్ట్ పెట్టింది. అయితే ఆమె పెట్టిన ఈ పోస్ట్ పవన్ ని ఉద్దేశించి పెట్టినదే అంటూ కొందరు అంటుంటే, మరికొందరు మాత్రం అదేమీ కాదని కొట్టిపారేస్తున్నారు....!!  

మరింత సమాచారం తెలుసుకోండి: