టాలీవుడ్ యంగ్ స్టార్, పవర్ స్టార్ కి వీరాభిమాని నితిన్. ఈ యంగ్ హీరో నటించిన లేటెస్ట్ సినిమా భీష్మ. కన్నడ బ్యూటి రష్మిక మందన నితిన్ సరసన హీరోయిన్ గా నటించింది. టాలీవుడ్ లో ఛలో సినిమాతో తనకంటు మంచి గుర్తింపు తెచ్చుకున్న వెంకీ కుడుముల ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ భారీగా నిర్మిస్తోంది. మెలోడి బ్రహ్మ మణిశర్మ తనయుడు మహతి స్వర సాగర్ ఈ సినిమాకి సంగీతం అందించాడు. ఈనెల 21న సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వస్తోంది. ఈ సందర్భంగా పోస్టర్ ప్రచారం.. లిరికల్ సాంగ్స్ తో ప్రచారం చేస్తూ జనాలలో ఆసక్తిని పెంచుతున్నారు చిత్ర యూనిట్. ఇంతక ముందు వరకూ రిలీజ్ చేసిన వాటే బ్యూటీ లిరికల్ వీడియో సాంగ్ అభిమానుల్లోకి దూసుకెళ్లింది. 

 

నితిన్ - రష్మిక జోడీ రొమాన్స్ కి యూత్ ఓ రేంజులోనే కనెక్టయ్యారు. ఇక సంగీత దర్శకుడు మహతి సాగర్ ట్యూన్స్ కి ప్రశంసలు దక్కాయి. తండ్రి మణిశర్మ లాగానే సందర్భానుసారం ట్యూన్స్ కంపోజ్ చేయడంలో దిట్ట అని పేరు తెచ్చుకున్నాడు మహతి. ఇక భీష్మలో ప్రతి పాటా దేనికదే వైవిధ్యం అన్నంతగానే తీర్చిదిద్దారు. ఈ శుక్రవారం సింగిల్ ఆంథెమ్ సాంగ్ ని లాంచ్ చేయనున్నారు. ఇక ఈ పాటలో నితిన్ కొత్త లుక్ పోస్టర్ ని టీమ్ తాజాగా రిలీజ్ చేశారు. పోస్టర్ లో నితిన్ శోభన్ బాబు గెటప్ ఫ్యాన్స్ కి కొంతమందికి నచ్చితే కొంతమందికి మాత్రం అసలు నచ్చలేదట. ఆ నుదుటిపై రింగు తిప్పి .. గిటార్ ప్లే చేస్తూ నితిన్ రెట్రో లుక్ అంతగా సూట్ అవలేదని చెప్పుకుంటున్నారు. బ్యాగీ ఫ్యాంటు.. పచ్చ చొక్కా.. పింక్ కళ్లద్దాలు నితిన్ కి ఎబ్బెట్టుగా ఉన్నాయని కామీంట్స్ పడుతున్నాయి. 

 

భీష్మలో ఈ సాంగ్ సంథింగ్ స్పెషల్ అయినప్పటికి గెటప్ పరంగా నితిన్ అంతగా ఆకట్టుకోలేపోయాడని టాక్ వినిపిస్తుంది. సాంగ్ లో ఎదో కలర్ ఫుల్ గా కనిపించినప్పటికి అది ఈ క్లాస్ హీరోకి మైనస్ అవుతుందేమోనన్న సందెహాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు అ..ఆ వంటి సినిమాలే నీకు బావుంటాయని, లై, ఇలాంటి రెట్రో గెటప్స్ నీకు సెట్ అవవని ఎందుకింత ఎక్స్‌ట్రాలు నీకు సూటయ్యో గెటప్స్ తో మ్యాజిక్ చేయొచ్చు కదా అని ఫ్యాన్స్ నితిన్ కి సలహాలిస్తున్నారట. ఆ మాట వాస్తవమే కదా ఎక్స్పరిమెంట్స్ నితిన్ కి సెట్ అవడం లేదు. మరి ఈ ఎక్స్ట్రాలు తగ్గించుకుంటే బెటర్. లేదంటే ఇప్పటికే ఫ్లాప్స్ పడి పరిస్థితి దారుణంగా ఉంది. అది ఇంకా దారుణంగా అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: