చిరంజీవి ఒక చిన్న నటుడిగా సినీ ప్రయాణం మొదలు పెట్టి సుప్రీం హీరోగా ఆ తర్వాత మెగాస్టార్ గా ఎదిగిన వైనం అందరికీ తెలిసిందే. ఇప్పుడు మెగాస్టార్ అన్న పదం తన పేరు పక్కన తోడవ్వడానికి ఎన్నేళ్ళుగా కృషి చేసి స్వయం కృషి తో పైకి వచ్చారో సినిమా ఇండస్ట్రీలో ప్రతీ ఒక్కరితో పాటు మెగా ఫ్యాన్స్ దగ్గర నుంచి సాధారణ ప్రేక్షకుడికి తెలిసిందే. అందుకే ఆయన సినిమా అంటే కేవలం అభిమానులే కాదు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్ లాంటి దిగ్గజాలు కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తుంటారంటే మెగాస్టార్ కెపాసిటీ ఏంటో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. 

 

ఇక చిరంజీవి చిన్న మొక్కలా సినిమా ఇండస్ట్రీలో మొలిచి ఒక మహా వృక్షం లా ఎదిగిన విధానం చూస్తే ఇలాంటి అసాధారణమైన పాపులారిటి, క్రేజ్ టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఇంకెవరికైనా సాధ్యమా అని ఆలోచిస్తూ ఆశ్చర్యంలో కొన్ని రోజులు ఉండిపోవాల్సిందే. అయితే చిరు తన ఎదుగుదలతోపాటే తన నీడన ఉన్న తన సోదరులని ఎదిగేలా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఒక్కో మెట్టు ఎక్కేలా అన్ని విషయాల్లో అండగా ఉంటూ ఒకరిని నిర్మాతగా, ఒకరిని హీరోగా ఇండస్ట్రీలో నిలబెట్టారు. తను నడిచిన ముళ్ళ బాటని చెరిపేసి వేసిన పూల బాటలో తనవాళ్ళు ఇప్పుడున్నారంటే అందుకు మెగాస్టార్ రాత్రింబవళ్ళు ఎంత శ్రమించి ఉంటారో తలుచుకుంటే జీవితం మీద విరక్తి కలిగి ఉన్న ఎవరికైన చిరు ఆశ కలగక మానదు.

 

ఇప్పుడు అదే పూల దారిలో నడుస్తున్న చిరు తమ్ముళ్ళని కలిపి మెగా సోదరులు..మెగా బ్రదర్స్ అంటూ అభిమానులతో పాటు సినిమా ఇండస్ట్రీలో వాళ్ళు పిలుచుకుంటున్నారంటే ఈ అన్నదమ్ముల మధ్య ఉన్న అనుబంధం ఎంత బలమైందో ..ఆ బంధంలో ఎంత ప్రేమ దాగి ఉందో తలుచుకుంటే ప్రతీ ఒక్కరికి ఆనందంతో మనసు చలించక మానదు. మెగాస్టార్ కి తమ్ముళ్ళైన నాగబాబు, పవన్ కళ్యాన్ ..ఇద్దరు కూడా ఇప్పటి వరకు అన్నయ్య మాట మీరింది గాని గీసిన గీత దాటింది గాని లేవని చెప్పక తప్పదు. టాలీవుడ్ లో నాగబాబు పెద్ద నిర్మాత అయినప్పటికి, పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ అయినప్పటికి ఆ ఇద్దరికి మాత్రం స్టార్ అంటే తమ అన్నయ్యోనని చెప్పడం ఎంతో గొప్ప విషయం..విశేషం. ఇదే మాట సభాముఖంగా పబ్లిక్ ఫంక్షన్ లో పవర్ స్టార్ అన్నయ్యని ఉద్దేశించి స్టార్ అంటే అన్నయ్యో ..నేను కాదు అన్న మాట .. జీవితంలో ఏ తమ్ముడైనా ఒప్పుకుంటాడా ..అది తను ఒక స్టార్ హీరో అయుండి. అది మెగా బ్రదర్స్ అంటే.  

మరింత సమాచారం తెలుసుకోండి: