కార్తికేయ అనగానే ఎవరికైనా ‘ఆర్ఎక్స్ 100’ సినిమా .. ఆ సినిమాలో లిప్ లాక్ పోస్టర్స్, పిల్లా రా సాంగ్..ప్రతీ ఒక్కరికి ఇవే గుర్తొస్తాయి. కార్తికేయ మొదటి సినిమా ప్రేమతో మీ కార్తీక్ అయినప్పటికి ఆర్ఎక్స్ 100 సినిమాతోనే మంచి గుర్తింపును దక్కించుకున్నాడు. నటన పరంగాను ఇండస్ట్రీలో చాలా మంది సీనియర్స్ నుంచి ప్రశంసలు అందుకున్నాడు. ఆ తర్వాత హీరోగా.. విలన్ గా కొన్ని సినిమాల్లో నటించిన కార్తికేయ సక్సెస్ ను మాత్రం దక్కించుకోలేకపోయాడు. హిప్పీ, గుణ 369 వంటి సినిమాలు చేసినా కూడా కార్తికేయ అనగానే అందరికీ ఆర్ఎక్స్ 100 సినిమా తప్ప ఇంకేది తెలీదు అంటున్నారటే ఏ స్థాయిలో ఉన్నాడో తెలుస్తోంది.

 

ఫస్ట్ మూవీతో వచ్చిన క్రేజ్, సక్సస్.. అడ్డం పెట్టుకొని కెరీర్ ను బిల్డ్ చేసుకోవడంలో కార్తికేయ దారుణంగా ఫేయిల్ అయ్యాడు. ఇలాంటి నేపథ్యంలో కార్తికేయకు అనూహ్యంగా గీతాఆర్ట్స్ 2 బ్యానర్ లో ఒక సినిమా చేసే ఛాన్స్ దక్కింది. కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలు.. మంచి బలమైన కథాంశం ఉన్న సినిమాలను నిర్మిస్తున్న గీతాఆర్ట్స్ బ్యానర్ తో కార్తికేయకు లక్ కలిసి వచ్చే అవకాశం ఉందని చాలామంది మాట్లాడుకుంటున్నారు.

 

గీతాఆర్ట్స్ 2 బ్యానర్ లో కార్తికేయ హీరోగా కౌశిక్ అనే నూతన దర్శకుడి దర్శకత్వంలో ‘చావు కబురు చల్లగా’ అనే టైటిల్ తో సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా తాజాగా పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం అయ్యింది. అల్లు అరవింద్ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. శవాలను మోసే ఒక వ్యాన్ డ్రైవర్ బాలరాజు పాత్రలో ఊర మాస్ లుక్ తో కార్తికేయ కనిపించబోతున్నాడట. అందులో భాగంగానే ఈ సినిమా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు అరవింద్ అండ్ టీం.

 

సినిమా కాన్సెప్ట్ చాలా ఆసక్తికరంగా ఉంటంతో టైటిల్ విచిత్రంగా ఉండటంతో అందరిలో ఆసక్తి పెరిగిపోయింది. ఇక ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తోంది.  త్వరలో షూటింగ్ మొదలవబోతున్న ఈ సినిమా టైటిల్ విషయంలో ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయట. అసలు ఒక యంగ్ హీరో తో ‘చావు కబురు చల్లగా’ అన్న టైటిల్ పెట్టి సినిమా తీయాలనే థాట్ ఎలా వచ్చిందని ఆలోచిస్తున్నారట. వాస్తవంగా ఇలాంటి టైటిల్స్ ఎప్పుడు అరవింద్ గారు పెట్టింది లేదు. మరి ఇంత ఆసక్తికరమైన టైటిల్ పెట్టాలన్న ఆలోచన ఎలా వచ్చిందోనని అరవింద్ గారిని అడుగుతున్నారట.  

మరింత సమాచారం తెలుసుకోండి: