‘అర్జున్ రెడ్డి’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓవర్ నైట్ లో స్టార్ హీరో అయిపోయాడు విజయ్ దేవరకొండ. యూత్ లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న విజయ్ దేవరకొండ మెల్ల మెల్లగా తన మార్కెట్ విస్తరించేలా సినిమాలు చేశాడు. ఒకవైపు సినిమాలు చేస్తూ మరోవైపు వ్యాపార రంగంలో కూడా రాణిస్తున్నాడు. సౌత్ లో మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్న విజయ్ దేవరకొండ బాలీవుడ్ వైపు కూడా ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇదిలా ఉండగా క్రాంతిమాధవ్ దర్శకత్వంలో తాజాగా చేసిన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమా మరి కొద్ది గంటల్లో విడుదల కానుంది. అయితే సినిమాకి సంబంధించి ప్రమోషన్ విషయాల్లో చాలా సైలెంట్ గా గత సినిమాల మాదిరిగా హడావిడి లేకుండా సైలెంట్ హిట్ కొట్టాలని ఫుల్ గా డిసైడ్ అయినట్లు సినిమా వాతావరణ పరిస్థితి చూస్తే అర్థమవుతుంది.

 

ఎన్నడూ లేని విధంగా సినిమాలో నలుగురు హీరోయిన్లతో విజయ్ దేవరకొండ నటించడంతో అభిమానుల్లో అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ముఖ్యంగా అర్జున్ రెడ్డి సినిమా టైపులో సినిమా స్టిల్స్ ఉండటంతో...అదే రేంజ్ లో హిట్ కొట్టాలని రౌడీ విజయ్ దేవరకొండ అభిమానులు కోరుకుంటున్నారు. ఇవాళ మరి కొద్ది గంటల్లో విడుదల కానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ బానే జరిగిందట. కాకపోతే సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు చాలా తక్కువగా చేయటంతో ప్రీ రిలీజ్ బుకింగ్స్ చాలా ఆశాజనకంగా లేనట్లు వార్తలు వస్తున్నాయి.

 

సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ బిజినెస్ 30.5 కోట్ల మేరకు జరిగినట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా నాన్ థియేట్రికల్ హక్కుల విషయానికి వస్తే వివిధ హక్కుల రూపంలో మొత్తం మీద 50 కోట్ల మేరకు సినిమాను అమ్మినట్లు టాలీవుడ్ ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. జరిగిన బిజినెస్ పార్టీ సినిమా రిలీజయ్యాక దాదాపు వంద కోట్ల మేరకు అమౌంట్ రాకపోతే బిజినెస్ చేయకపోతే సినిమా అట్టర్ ఫ్లాప్ కింద నమోదయ్యే అవకాశం ఉంది అని తాజాగా ఈ మొత్తం లెక్కల బట్టి సినిమా విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: