గత వారం పది రోజులుగా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు రెండవ పెళ్ళి. ఆయన మొదటి భార్య అనిత గుండె పోటుతో హఠాత్తుగా మరణించిన సంగతి తెలిసిందే. భార్య మరణంతో దిల్ రాజు చాలా రోజులు కోలుకోలేకపోయారు. తన భార్య పేరు మీదే సక్సస్ ఫుల్ గా నిర్మాణ సంస్థని కొనసాగిస్తూ ఎంతో మంది టాలెంటెడ్ డైరెక్టర్స్ ని 26 క్రాఫ్ట్స్ కి సంబంధించిన ఇతర టెక్నీషియన్స్ ని ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ అందరికీ వెన్నుముకలా నిలుస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న టాప్ డైరెక్టర్స్ లో చాలామంది దిల్ రాజు కాంపౌండ్ నుంచి వచ్చినవాళ్ళే అన్న సంగతి తెలిసిందే. డిస్ట్రిబ్యూటర్ గా సక్సస్ అయిన దిల్ రాజు నిర్మాణంలోకి అడుగుపెట్టి అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ ప్రొడ్యూసర్ గా వన్ ఆఫ్ ది మేయిన్ పిల్లర్ గా నిలబడ్డారంటే ఆయన ఎంత కష్టపడ్డారో ఊహించుకోవచ్చు.


 
వాస్తవంగా ఒక నిర్మాత సినిమా నిర్మాణం మొదలు పెట్టినప్పటి నుంచి ఆ సినిమా రిలీజై హిట్ టాక్ వచ్చి కలెక్షన్స్ పరంగా సేఫ్ జోన్ లోకి వచ్చింది అన్న మాట వినిపించేంత వరకు టెన్షన్ లోనే గడుపుతారు. ఇక పవన్ కళ్యాణ్, ప్రభాస్, మహేష్ బాబు లాంటి స్టార్స్ తో సినిమా అంటే ఎలా ఉంటుందో చెప్పనవసరం లేదు. నిద్ర పట్టక రోజూ రాత్రి నిద్ర మాత్రలు వేసుకుంటే గాని పడుకోలేని పరిస్థితి. అలాంటి దిల్ రాజుకి అన్ని తానై వెన్నంటే ఉండి భార్య అనిత అన్ని విధాలుగా సపోర్ట్ చేయడం దిల్ రాజు చేసుకున్న అదృష్ఠం అని చెప్పాలి. దిల్ రాజు గారు తన భార్య అనిత పేరు మీద సమర్పణ అని సినిమాలని నిర్మించడం ఆయనకి సెంటిమెంట్ భావించబట్టే అని అర్థం చేసుకోవచ్చు. కాని అలాంటి అదృష్ఠం ఇప్పుడు లేదు.

 

అంతటి గొప్ప భాగస్వామిని పోగొట్టుకున్న దిల్ రాజు నెమ్మదిగా కోలుకొని మళ్ళీ సినిమాలతో క్షణం తీరిక లేకుండా బిజీగా ఉన్నారు. ప్రస్తుతానికి ఆయనకి సినిమాలు తప్ప మరో ధ్యాసే లేదు. ఇక ఆయన బెటర్ హాఫ్ అయిన బంగారం లాంటి అనిత ప్లేస్ ని ఇంకొకరొతో భర్తీ చేసే ఆలోచనే లేదని తాజాగా ఆయన రెండవ పెళ్ళి కి సంబంధిచి వస్తున్న రూమర్స్ పై రియాక్ట్ అయినట్టు తాజా సమాచారం. అసలు దిల్ రాజు కి మళ్ళీ పెళ్ళి చేసుకునే ఉద్దేశ్యం గాని, టైం గాని, ఆసకి గాని లేదని ఆయన సన్నిహిత వర్గాల నుండి వచ్చిన సమాచారం. ఇదే వాస్తవం. కాని అనవసరంగా గత వారం రోజులగా సోషల్ మీడియాలో ఆయన గురించి తప్పుడు రాతలు రాశారు. ఆ రాతలు తప్పని క్లారిటి ఇచ్చారట దిల్ రాజు. నా భార్య అనిత నే నా దైవం. ఈ టైంలో రెండో పెళ్ళి చేసుకునేంత టైం, ఇంట్రెస్ట్ రెండూ లేవు అని మీడియాకి క్లారిటి ఇచ్చారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: