పీపుల్ స్టార్ గా తన పంథా తనదే అన్నట్టుగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న ఆర్.నారాయణ మూర్తి రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. తనకు వచ్చిన ఎన్నో మంచి అవకాశాలను సైతం వదులుకున్న నారాయణ మూర్తి తన దారి తనదే అన్నట్టుగా సినిమాలు చేస్తూ వెళ్తుంటారు. పూరి జగన్నాథ్ డైరక్షన్ లో ఎన్.టి.ఆర్ హీరోగా వచ్చిన టెంపర్ సినిమాలో పోసాని కృష్ణమురళి చేసిన పాత్ర నారాయణ మూర్తి చేయాల్సింది. ఆయనకు ఎంత రెమ్యునరేషన్ కావాలన్నా సరే ఇస్తానన్న పూరి ఆఫర్ ను సైతం తిరస్కరించాడు నారాయణమూర్తి.

 

అయితే అలాంటి నారాయణ మూర్తి మెగా హీరో సినిమాలో ప్రత్యక్షమయ్యాడు. అదేంటి ఆయన అలా ఎలా చేస్తారని మీరనుకోవచ్చు. మెగా మేనళ్లుడు సాయి తేజ్ హీరోగా సుబ్బు డైరక్షన్ లో వస్తున్న సినిమా సోలో బ్రతుకే సో బెటర్. బోగవళ్లి ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా నుండి వాలెంటైన్స్ డే సందర్భంగా థీం వీడియో రిలీజ్ చేశారు. అందులో నారాయణ మూర్తి కనిపించారు. సోలో బ్రతుకే సో బెటర్.. రియల్ లైఫ్ లో ఇప్పటికి సోలోగా ఉన్న వారి కటౌట్ ల పక్కన నారాయణ మూర్తి కటౌట్ ఉంది.

 

ఆయన పర్మిషన్ తీసుకున్నారో లేదో కాని వాజ్ పేయి, మదర్ థెరిసాల సరసన నారాయణ మూర్తి బొమ్మ పెట్టేశారు. ఇక మన స్లోగన్ సోలో బ్రతుకే సో బెటర్ అంటూ సాయి తేజ్ చేస్తున్న హంగామా బాగుంది. చిత్రలహరితో హిట్ ట్రాక్ ఎక్కిన మెగా హీరో 2019 చివర్లో ప్రతిరోజూ పండుగే సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకున్నాడు. చూస్తుంటే సోలో బ్రతుకే సో బెటర్ తో కూడా మరో మెమరబుల్ హిట్ కొట్టేలా ఉన్నాడు. ఈ సినిమాలో నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తుంది. సమ్మర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ సినిమా నుండి వచ్చిన ఈ థీం వీడియోలో సాయి తేజ లుక్ సినిమాపై అంచనాలు పెంచింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: