రౌడీ ట్యాగ్ తో టాలీవుడ్ లో సెన్సేషనల్ స్టార్ గా మారిన విజయ్ దేవరకొండ తనకు వచ్చిన ఈ స్టార్ ఇమేజ్ ను పూర్తిగా ఆస్వాధిస్తున్నట్టుగా అనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ డియర్ కామ్రేడ్ సినిమాతో ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో విఫలమైన విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ తో హిట్టు పక్కా అంటున్నాడు. క్రాంతి మాధవ్ డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో నలుగురు క్రేజీ హీరోయిన్స్ స్పెషల్ ఎట్రాక్షన్ గా మారనున్నారు. అయితే ఈ సినిమా తర్వాత తను ఇక మీదట లవ్ స్టోరీస్ చేయనని చెప్పాడు రౌడీ హీరో. ఆ స్టేట్మెంట్ వెనుక ఉన్న అసలు కథ ఏమై ఉంటుందా అని అందరు ఆలోచించారు.

 

పెళ్లిచూపులు నుండి వరల్డ్ ఫేమస్ లవర్ వరకు విజయ్ కు ఈ క్రేజ్ తెచ్చింది ప్రేమకథా చిత్రాలే.. అలాంటిది ఇక మీద లవ్ స్టోరీస్ చేయనని చెప్పడం షాకింగ్ గా అనిపించింది. అయితే విజయ్ అలా చెప్పడం వెనుక కొందరు వ్యక్తులు ఉన్నట్టుగా చెబుతున్నారు. వరల్డ్ ఫేమస్ లవర్ తర్వాత తను చేస్తున్న సినిమా దర్శకుడు మాటల వల్ల విజయ్ అలా మారిపోయాడని అంటున్నారు. లవ్ స్టోరీస్ తీయడం వల్ల అందులో ఒకటో రెండో లిప్ లాక్ సీన్స్ పెట్టాల్సి వస్తుంది. వాటి వల్ల కొంతమంది ఫ్యామిలీ ఆడియెన్స్ విజయ్ దూరమవుతాడని ఇక మీదట అలాంటి సీన్స్ కు దూరంగా ఉండాలని ఫిక్స్ అయ్యాడట.

 

పూరి డైరక్షన్ లో వస్తున్న సినిమాలో విజయ్ ఫైటర్ గా కనిపిస్తాడని తెలుస్తుంది. ఆ సినిమా నుండి కొత్త విజయ్ దేవరకొండని చూస్తారని అంటున్నారు. పూరి సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతుంది కాబట్టి విజయ్ ఇక మారక తప్పట్లేదట. ఆ సినిమాలో అనన్యా పాండే హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాతో విజయ్ కూడా నేషనల్ స్టార్ అవ్వాలని చూస్తున్నాడు. అది ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి.
 

మరింత సమాచారం తెలుసుకోండి: