టాలివుడ్ లో సినిమాలకు మార్కెట్ పెరిగింది అనే విషయం కొన్ని రోజులుగా స్పష్టంగా అర్ధమవుతుంది. స్టార్ హీరోల మార్కెట్ చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. దాదాపు అందరు స్టార్ హీరోల సినిమాలు కూడా ఇదే విధంగా ఉన్నాయి అనేది వాస్తవం. అందుకే దర్శకనిర్మాతలు వారితో సినిమాలు చేయడానికి ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు అనేది వాస్తవం. ముఖ్యంగా స్టార్ నిర్మాతలు అయితే స్టార్ దర్శకుల కోసం పోటీ పడుతున్నారు. టాలివుడ్ మార్కెట్ లో తమ సత్తా ఏంటో చూపించాలని ఎక్కువగా స్టార్ నిర్మాతలు ఆశపడుతున్నట్టు తెలుస్తుంది. 

ఈ నేపధ్యంలోనే స్టార్ హీరోలు కూడా వచ్చిన అవకాశాన్ని ఎందుకు వదులుకోవాలి అనుకుంటున్నారో ఏమో గాని ఇప్పుడు కాస్త ట్రెండ్ మార్చినట్టే కనపడుతుంది. ఇన్నాళ్ళు సినిమాలను ఫాస్ట్ గా విడుదల చెయ్యాలనకునే హీరోలు ఇప్పుడు సినిమాను ఎంత లేట్ చేస్తే అంత మంచిది అన్నట్టు భావిస్తున్నారు. సినిమా లేట్ అయిన కొద్దీ అభిమానులలో ఆత్రం పెరుగుతుందని, ఇక సినిమా కథను కూడా కాస్త భిన్నంగా ట్రై చేస్తే క్లిక్ అయ్యే అవకాశాలు ఉంటాయని భావిస్తున్నారు. అందుకోసం దర్శక నిర్మాతలకు సలహాలు ఇస్తూ సహకరిస్తున్నారు. 

సినిమా లేట్ అయినా పర్వాలేదు హిట్ అవ్వాలని చూస్తున్నారు. పాన్ ఇండియా వైడ్ గా సినిమాలను ఆడిస్తే ఇంకా మంచి లాభం ఉంటుంది అనేది హీరోల అభిప్రాయ౦. ఇతర భాషల్లో కూడా సినిమాను ప్రమోట్ చేసుకోవాలని, బాలివుడ్ హీరోల మాదిరిగా దేశం మొత్తం విస్తరించాలని, ఇందుకోసం అవసరమైతే తమ సినిమాల్లో బాలివుడ్ స్టార్లను పెట్టుకోవాలని భావిస్తున్నారు హీరోలు. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, ప్రభాస్ ఇప్పుడు ఇదే ఫార్ములాను ఫాలో అవుతూ ముందుకి వెళ్తున్నారు. ప్రభాస్ అయితే మూడేళ్లకి ఒక సినిమా చేస్తున్నాడు. అందుకే దర్శకనిర్మాతలు వారితో సినిమాలు చేయడానికి ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: