బాలకృష్ణ కెరీర్లో బెస్ట్ సినిమాల్లో ఒకటిగా చెప్పుకోదగ్గ సినిమా భైరవద్వీపం.  ఈ సినిమా అప్పట్లో సంచలన విజయం నమోదు చేసుకుంది.  ఇందులో బాలకృష్ణ అనేక రూపాల్లో అద్భుతంగా నటించాడు.  అందులో ఒకటి కురూపి రూపం.  మాస్ హీరోగా ప్రేక్షకుల్లో మంచి పేరు తెచ్చుకున్న బాలయ్య ఇలా చేయడం అంటే మాములు విషయం కాదు.  దానికి చాలా గట్స్ కావాలి.  


కానీ, బాలకృష్ణ ఆ సినిమాలో అద్భుతంగా నటించి మెప్పించారు.  నటించి మెప్పించడం అంటే మాములు విషయం కాదు.  పైగా అభిమానులు బాలయ్యను అలా చూస్తామని కలలో కూడా ఊహించి ఉండరు.  సినిమా సూపర్ హిట్ అయింది కాబట్టి పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు.  అలా కాకుండా సినిమా కనుక తేడా కొట్టి ఉంటె వ్యవహారం మరోలా ఉండేది.  సినిమా విషయంలో అభిమానులు అందరూ కూడా సూపర్ అని ఎంజాయ్ చేశారు తప్పించి ఆ పాత్రపై వేలుపెట్టి చూపలేదు.  


ఈ సినిమాకు ముందు బాలకృష్ణ రౌడీ ఇన్స్పెక్టర్, నిప్పురవ్వ, బంగారు బుల్లోడు సినిమాలు చేసి మాస్ హీరోగా మంచి ఊపుమీదున్నాడు.  ఈ సమయంలో భైరవద్వీపం లాంటి సినిమా అయన దగ్గరకు వస్తే మరోమాట మాట్లాడకుండా ఒప్పుకున్నారు.  ఒప్పుకోవడమే కాదు చేసి తానేంటో నిరూపించుకున్నారు.  జానపద చిత్రాల్లో నటించాలని బాలయ్యకు ఉన్న కోరికను అలా మరోసారి తీర్చుకున్నాడు.

 
సింగీతం తీసిన ఈ సినిమా సూపర్ అనిపించుకుంది.  కురూపి పాత్రకు మేకప్ చేయడానికి రెండు గంటల సమయం పడుతుందట.  దాదాపుగా ఈ పాత్రకోసం పదిరోజులపాటు బాలయకృష్ణ కష్టపడ్డారు.  కేవలం ఆ పదిరోజులు సెట్స్ జ్యూస్ లు మాత్రమే తాగి షూటింగ్ చేశారట.  ఇకపోతే,  కాళ్లకు చెప్పులు లేకుండా ఆ పాత్ర నడవాల్సి వస్తుంది.  ఆ సమయంలో కూడా బాలయ్య ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే ఆ పాత్రను ఛాలెంజ్ గా తీసుకొని నటించి మెప్పించారు.  ఇలాంటి పాత్రను బాలయ్య చేస్తున్నారని సినిమా రిలీజ్ వరకు ప్రేక్షకులకు తెలియకుండా దాచిపెట్టారు.  బాలకృష్ణను సినిమాలో చూసి అభిమానులు షాకయ్యారట.  

మరింత సమాచారం తెలుసుకోండి: