ప్రేమ రెండక్షరాల ఈ పదానికి ఎన్ని అబ్రివేషన్స్ చెప్పినా సరిపోదు.. ప్రేమ రెండు అక్షరాల ఈ పదానికి ఎన్ని కొటేషన్స్ తో చెప్పినా సరితూగదు. ఈ సృష్టిలో మనిషిని కదిలించే ఓ అద్భుతమైన భావన ప్రేమ. ఇద్దరి వ్యక్తుల మధ్య ప్రేమ పరవశం మొదలైతే ఆ కిక్ వేరేలా ఉంటుంది. తన కోసమే పుట్టినట్టుగా తన ప్రేయసిని అందాల దేవతగా ఆరాధించే ప్రేమికులు ఈ కాలంలో కూడా ఉన్నారు. ఒకప్పుడు ప్రేమలేఖలతో మొదలైన ఈ ప్రేమ ఇప్పుడు వాట్సాప్ మెసేజ్ లతో ప్రపోజ్ చేసుకునే వరకు వచ్చింది.

 

ఎలా ప్రపోజ్ చేసినా సరే ప్రేమ అనేది ఓ అద్భుతమైన, అనిర్వచనీయమైన భావన. తనకు పరిచయంలేని ఓ వ్యక్తిని ప్రాణంగా భావించేలా చేస్తుంది ఈ ప్రేమ. అంతేకాదు ప్రేమని గెలవడం అంటే ప్రేమించిన అమ్మాయినో, అబ్బానియో పెళ్లాడటం కాదు పరిస్థితుల కారణంగా వారిని పొందలేకపోయినా సరే త్యాగం కూడా నవ్వుతూ చేయగలగడమే నిజమైన ప్రేమ. వారిని మరచి జీవితాన్ని సాగించడం కష్టమైనా అలా ఉండగలగడం కూడా ప్రేమించడమే అని చెప్పొచ్చు.  

 

అంతేకాదు నిజమైన ప్రేమకు ఎప్పటికి చావనేది ఉండదు. ఈ కాలం ప్రేమ ఒక టైం పాస్ గా అనిపిస్తున్నా కొంతమంది ఇప్పుడు కూడా ప్రేమ మీద ఓ మంచి అవగాహనతో ఉన్నారు. మాట్లాడకుండా మన ఫీలింగ్స్ ను అర్ధం చేసుకోవడమే ప్రేమలోని మ్యాజిక్ అని చెప్పొచ్చు. తరాలు మారినా.. దశాబ్ధాలు మారినా ప్రేమ ఎప్పటికి నిలిచి ఉంటుంది. సంవత్సరానికి వందల కొద్ది సినిమాలు రిలీజైనా అందులో ప్రేమకథలే ఎక్కువ ఉంటాయి. సినిమాల్లో ప్రేమలా బయట ఉన్నా లేకున్నా సినిమాలో చూపించిన ప్రేమకు తమ ప్రేమని అన్వయించుకుంటూ ప్రేమికుడు పొందే అనుభూతి అంతా ఇంతా కాదు. ప్రేమంటే కేవలం పెళ్లికి ముందు ప్రేమించే వారికే కాదు పెళ్లి తర్వాత భార్యను ప్రేమించే వారికి ప్రేమ యొక్క అనుభూతి తెలుస్తుంది.     

మరింత సమాచారం తెలుసుకోండి: