సినీ రంగంలో ప్రేమ పెళ్లిళ్లు సర్వసాధారణమే.. కానీ ఈ అమ్మడి ప్రేమ ఏకంగా ఖండాలు దాటేసింది. భాషకానీ.. భాష.. దేశం కానీ దేశం వ్యక్తిని ప్రేమించి.. తన ప్రేమను గెలిపించుకుంది. ఆ అమ్మడే ప్రియాంకాచోప్రా.. అమెరికన్‌ పాప్‌ గాయకుడు, నటుడైన నిక్‌ జోనస్‌తో ఏడడుగులు వేసింది నటి ప్రియాంక చోప్రా.

 

 

బాలీవుడ్‌లోనూ అ హాలీవుడ్‌లోనూ దూసుకుపోతున్న ఈ మాజీ ప్రపంచసుందరికి ఓ హాలీవుడ్‌ సినిమా ఫంక్షన్‌లో నిక్‌ పరిచయమయ్యాడు. అతగాడి మనస్తత్వం, మాటతీరు అచ్చం ఆమె తండ్రి మాదిరిగా ఉండటంతో నిక్‌ పైన మనసుపడి కొంతకాలం డేటింగ్‌ చేసింది. వయసులో చిన్నవాడైనా బాగా నచ్చేశాడు.

 

 

అంతే ప్రేమ ప్రపోజ్ చేసింది. తండ్రిలా చూపుతున్న ప్రేమను శాశ్వత బంధంగా మలచుకోవాలనుకుంది. 2018లో అతడిని పెళ్లాడింది ప్రియాంక. అమెరికాలోనే కాపురం పెట్టినా స్వదేశంతో సంబంధాలు వదులుకోకూడదని బాలీవుడ్‌ సినిమాల్లోనూ నటిస్తోంది.

 

 

అటు పుట్టింటినీ, అత్తారింటినీ మెప్పిస్తోంది. తరచూ అటూ ఇటూ రాకపోకలు జరుపుతోంది ఈ అమ్మడు. మొత్తానికి ప్రేమకు భాషా,ప్రాంతీయ బేధాల్లేవని చాటి చెప్పేసింది ప్రియాంక చోప్రా.

 

మరింత సమాచారం తెలుసుకోండి: