సినిమా ఇండస్ట్రీలో అఫైర్స్ లేని హీరోలు, హీరోయిన్స్ చాలా త‌క్కువ‌గా ఉంటారు. వాస్త‌వానికి సినిమా ఇండస్ట్రీలో ప్రేమ పెళ్లిళ్లు సర్వసాధారణం. సినీ ఇండస్ట్రీకి చెందిన తల్లిదండ్రులు కూడా ప్రేమకు పెద్ద మనసుతో అంగీకరించి వివాహం జరిపిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే  చాలా మంది హీరో, హీరోయిన్లు సీక్రెట్‌గా లవ్ చేసుకుని పెళ్లి కానిచ్చేసిన వారూ ఉన్నారు. ఇక సీక్రెట్ పెళ్లి అంటే మ‌న‌కు ముందుగా గుర్తుకు వ‌చ్చేది మహేశ్ బాబు, నమత్ర శిరోద్కర్‌. వంశీ చిత్ర షూటింగ్‌లో వారిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ఏడడుగులు నడిచేలా చేసింది. 

 

ఆ తర్వాత వారిద్దరూ సంపూర్ణ వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తుండటం తెలిసిందే. అలాగే మీడియా కంట పడకుండా వీళ్లిద్ద‌రూ సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నారు. అందాల తార, మహానటి శ్రీదేవి,  బోని కపూర్ ఎవరికీ తెలియకుండా సైలెంట్‌గా పెళ్లి చేసుకున్నారు. అయితే శ్రీదేవి బోనికి రెండో భార్య. శ్రీదేవితో పెళ్లికి ముందే బోనికి మోనా కపూర్ తో వివాహం అయ్యింది. ఇక తాజాగా బెంగాలీ నటి తృణమూల్ ఎంపీ నుస్రత్ జహాన్ పెళ్లి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. కోల్‌కతాకు చెందిన బిజినెస్‌ మేన్ నిఖిల్ జైన్‌తో మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. అలాగే ధర్మేంద్ర,హేమా మాలిని ఇద్దరు ఎవరికి తెలియకుండా సీక్రెట్‌గా ఒకింటి వాళ్లు అయ్యారు.

 

ధూమ్-3 చిత్ర నిర్మాత, యశ్ రాజ్ ఫిలింస్ అధినేత ఆదిత్య చోప్రా.. హీరోయిన్ రాణీ ముఖర్జీ ఎవ‌రికి తెలియ‌కుండా సీక్రెట్ పెళ్లి చ‌సుకున్నారు. టీమిండియా సారథి విరాట్ కోహ్లీ, బాలీవుడ్ తార అనుష్క శర్మ సీక్రెట్‌గా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్న సంగ‌తి తెలిసిందే. మిర్ మొహ‌సీన్ అఖ్తర్‌, హీరోయిన్ ఊర్మిళా మాంటోడ్కర్ కూడా సీక్రెట్‌గానే ఒక‌ట‌య్యారు. షమ్మి కపూర్, గీతా బాలి కూడా ర‌హ‌స్యంగానే పెళ్లి చేసుకున్నారు. జై మెహాతా మ‌రియు  జుహీ చావ్లా కూడా ప్రేమించుకుని ఎవ‌రికి తెలియ‌కుండా వివాహం చేసుకున్నారు. అదేవిధంగా మనోజ్ వాజ్‌పేయ్, నేహా ఇద్దరు కూడా ఇలానే  పెళ్లి చేసుకున్నారు.

 
 

 

 

 

 
 

మరింత సమాచారం తెలుసుకోండి: