టాలీవుడ్ రౌడీ గా క్రేజ్ తెచ్చుకున్న విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమా వ‌స్తుందంటే టాలీవుడ్ యూత్‌లో మామూలుగా అంచ‌నాలు ఉండ‌డం లేదు. నోటా, డియ‌ర్ కామ్రేడ్ ఇలాంటి రెండు ప్లాప్‌ సినిమాల తర్వాత విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం వరల్డ్ ఫేమస్ ల‌వ‌ర్‌. క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ పై సీనియర్ నిర్మాత కె.ఎస్.రామారావు నిర్మించిన ఈ సినిమాకు సున్నితమైన చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ఏ. క్రాంతి మాధ‌వ్ ద‌ర్శ‌కత్వం వహించారు.

 

ప్రేమికుల రోజు కానుకగా ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పటికే ప్రీమియ‌ర్ షోలు కంప్లీట్ చేసుకుంది. ఇప్పటి వరకు వ‌చ్చిన టాక్‌ను బ‌ట్టి చూసుకున్నట్టయితే జస్ట్ ఓకే అని చెప్పొచ్చు.కొన్ని సన్నివేశాలు మరియు ఐశ్వర్య ఎమోషనల్ రోల్ బాగున్నాయ‌ని అంటున్నారు. యామిని(రాశీ) మరియు గౌతమ్(విజయ్ దేవరకొండ)ల జీవితాలకు సంబంధించిన సన్నివేశాలతో సినిమా ప్రారంభ మ‌వుతుంది. 

 

రాశీతో గౌతమ్ బ్రేకప్ అయ్యాక ఇప్పుడు గౌతమ్ ఫ్రెండ్ గా ప్రియదర్శి ఎంటర్ అవుతాడు. తెలంగాణాకు చెందిన శీనయ్య పాత్ర ఎంటర్ అయ్యింది. అలాగే అతని భార్య సువర్ణగా ఐశ్వర్య రాజేష్ న‌టించారు. క్యాథరిన్ మరియు శీనయ్య అలాగే మరోపక్క ఐశ్వర్య మరియు శీనయ్యల స్టోరీలకు సంబంధించిన సన్నివేశాలు న‌డిపించిన తీరు బాగుంది. అయితే క‌థ‌నం మాత్రం స్లోగా మూవ్ అవుతూ ప్రేక్ష‌కుల‌ను కాస్త ఇబ్బంది పెట్టింద‌ని ఎక్కువ మంది చెపుతున్నారు.

 

న‌లుగురు అమ్మాయిల‌తో గౌత‌మ్ గా విజ‌య్ న‌డిపించిన ప్రేమ సీన్లు బాగున్నాయి. ఇజా(ఇజబెల్) మరియు గౌతమ్ లు ఒకరికొకరు దగ్గరవ్వ‌డం  నేపథ్యంలో మై లవ్ సాంగ్ బాగుంది. చివ‌ర‌కు ఎమోష‌న‌ల్ క్లైమాక్స్ తో ఈ సినిమా ముగుస్తుంది. ఓవ‌ర్సీస్ టాక్ వ‌ర‌కు సూప‌ర్ టాక్ అయితే లేదు.. కొద్ది సేప‌ట్లోనే సినిమా పూర్తి ఫ‌లితం రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: