‘బాహుబలి’ తో ప్రభాస్ నేషనల్ సెలెబ్రెటీ గా మారిపోయాడు ఆ తరువాత అలాంటి స్థానాన్ని అందుకోవాలని చిరంజీవి లాంటి మెగా స్టార్ తన ‘సైరా’ ను అత్యంత భారీ బడ్జెట్ తో భారీ పబ్లిసిటీతో బాలీవుడ్ లో విడుదల చేసినా బాలీవుడ్ ప్రేక్షకులు ఏమాత్రం పట్టించుకోలేదు. ఇక రామ్ చరణ్ బాలీవుడ్ ఎంట్రీ ప్రయోగం ‘జంజీర్’ కూడ ఫెయిల్ అయింది.


మహేష్ లాంటి టాప్ హీరో ‘స్పైడర్’ తో తమిళ ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వాలని ప్రయత్నిస్తే ఆ ప్రయత్నం కూడ ఘోరమైన ఫ్లాప్ గా మారింది. ఇలాంటి పరిస్థితులలో అనేక వ్యక్తిగత సమస్యలతో పాటు సినిమాలకు మూడు సంవత్సరాలుగా దూరంగా ఉంటున్న మంచు మనోజ్ నిన్న చేసిన ప్రకటన ‘అహం బ్రహ్మస్మి’ సినిమా ప్రకటన టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీని మాత్రమే కాకుండా టాప్ హీరోలను కూడ ఆశ్చర్య పరుస్తోంది.


మంచు మనోజ్ తన సొంత ప్రొడక్షన్ హౌస్ పేరు మీద ఏకంగా 5 భాషలలో తన సినిమాను విడుదల చేస్తాను అని ప్రకటించడమే కాకుండా ఈ మూవీ షూటింగ్ మార్చి 6వ తారీఖు నుండి ప్రారంభంకాబోతున్న విషయాన్ని ప్రకటించాడు. తెలుగు తమిళ కన్నడ మళయాళ హిందీ భాషలలో ఈ మూవీ విడుదల కాబోతోంది. శ్రీకాంత్ రెడ్డి అనే యంగ్ డైరెక్టర్ ఈ మూవీకి దర్శకత్వం వహించబోతున్నాడు.


అయితే మంచు మనోజ్ పేరు నేటి తరం ప్రేక్షకులు పూర్తిగా మర్చిపోయిన నేపధ్యంలో ఏకంగా మనోజ్ ఐదు భాషల పై గురి పెట్టి నేషనల్ స్టార్ గా మారిపోవడం ఏమిటి అంటూ చాలామంది షాక్ అవుతున్నారు. ఇప్పటికే తన కెరియర్ విషయంలో అదేవిధంగా తన వ్యక్తిగత జీవితం విషయంలో అనేక పొరపాట్లు చేసిన మనోజ్ మరీ మితిమీరిన ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నాడా అంటూ మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ మూవీ ప్రారంభోత్సవానికి ఇండస్ట్రీలోని ప్రముఖులు అందరు రాబోతున్న సందర్భంలో మంచు మనోజ్ వార్తలు మళ్ళీ మీడియాకు కేంద్ర బిందువు కాబోతున్నాయి.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: