ప్రేమ పెళ్లి సంసారం... జీవితం ఇవన్నీ కూడా వినడానికి చాలా బాగుంటాయి.  రియల్ లైఫ్ లోకి వచ్చే సరికి వీటి అర్ధం మారిపోతుంది.  ప్రేమించిన అమ్మాయి దొరికితే... ఆ అమ్మాయిని చూసుకోవడానికి నానా ఇబ్బందులు పడుతుంటారు.  ఇక ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకోవడం మరో సాహసం అవుతుంది.  ఒకవేళ పెళ్లి చేసుకుంటే, ఆ తరువాత భార్యకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూసుకోవడం మరింత కష్టం.  


ఇన్ని కష్టాలను దాటుకొని జీవితాన్ని సాగించాలి అంటే చాలా కష్టమైన విషయం.  ఇద్దరి మధ్య అండర్ స్టాండింగ్ ఉండాలి.  ఇద్దరి మధ్య అన్యోన్యత ఉండాలి.  అప్పుడే మనిషి జీవితం సాఫీగా సాగిపోతుంది.  లేదంటే మాత్రం ఇబ్బందులు పడాల్సి వస్తుంది.  ఇంట్లో ఉన్న భార్య స్నేహితురాలిగా, ప్రియురాలిగా కష్టాల్లోనూ, సుఖాల్లోనూ కలిసి మెలిసి ఉంటె ఆ జీవితం హాయిగా సాగుతుంది.  


ఇలాంటి జీవితం అందరికి దొరకదు.  బోల్డ్ స్టార్ నుంచి బాలీవుడ్ సినిమా రంగంలోకి అడుగుపెట్టి జీవితాన్ని అద్భుతంగా తీర్చి దిద్దుకుంటున్న స్టార్ నటి సన్నీ లియోన్ ఈ విషయంలో సక్సెస్ సాధించినట్టు చెప్తున్నది.  ప్రేమించిన వ్యక్తి వెబర్ ను పెళ్లి చేసుకుంది.  పెద్దల సినిమాల్లో నటించినా కూడా ప్రేమ ముందు అవన్నీ చిన్నబోయాయి.  ఇప్పుడు వారికి ముగ్గురు పిల్లలు.  వీరిని ఆ కుటుంబం ఎలా చూసుకుంటుందో చెప్పక్కర్లేదు.  


ప్రేమంటే ఏవేవో అనుకుంటూ ఉంటారు.  ప్రేమకు అసలు అర్ధం అదికాదట.  ప్రేమ అంటే అర్ధం చాలా సింపుల్ అని అంటోంది.  అందమైన భార్య, సంతోషకరమైన జీవితం.. ఇవే ప్రేమకు పునాది. అనాదిగా వస్తున్న ప్రేమకు ఇదే ఒక రూపం.  ఎక్కడ సంతోషం ఉంటుందో అక్కడే ప్రేమ ఉంటుంది.  ఎక్కడ మనిషి హ్యాపీగా ఉంటాడో అక్కడే జీవితం సుఖంగా ఉంటుంది.  సుఖం లేని చోట సంతోషం ఉండదు.  సంతోషం లేని చోట ప్రేమ ఉండదు.  

మరింత సమాచారం తెలుసుకోండి: