ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ రెండవ పెళ్ళి విషయమై వస్తున్న వార్తలను దిల్ రాజ్ ఖండించక పోవడంతో ఈ వార్తలు నిజం అన్న నిర్ధారణకు ఇండస్ట్రీ వర్గాలు వచ్చేస్తున్నాయి. వివాద రహితుడుగా అందరి హీరోలతోనూ బయ్యర్లతోను మంచి సన్నిహిత సంబంధాలు కలిగిన దిల్ రాజ్ పెళ్ళి విషయమై ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ప్రకాష్ రాజ్ సలహా సంప్రదింపులు ఉన్నాయి అన్న గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి.


దిల్ రాజ్ కు ప్రకాష్ రాజ్ కు ఉన్న సాన్నిహిత్యం ఓపెన్ సీక్రెట్. గతంలో ప్రకాష్ రాజ్ ప్రవర్తనను భరించలేక టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ నిర్మాతలు అతడిని బ్యాన్ చేసినప్పుడు దిల్ రాజ్ తన స్నేహితుడు కోసం రంగంలోకి దిగి ప్రకాష్ రాజ్ ను ఆ కష్టాల నుండి గట్టెక్కించాడు. లేటెస్ట్ గా ప్రకాష్ రాజ్ కు అవకాశాలు తక్కువగా ఉన్న పరిస్థితులలో దిల్ రాజ్ ఒత్తిడి వల్లనే ‘సరిలేరు నీకెవ్వరు’ లో జగపతి బాబును తొలిగించి ప్రకాష్ రాజ్ ను పెట్టడం జరిగింది అన్న మాటలు కూడ వచ్చాయి.


వాస్తవానికి దిల్ రాజ్ కు రెండవ పెళ్ళి చేసుకునే ఉద్దేశ్యం లేదని అయితే వయసు పై పడ్డాక భార్య తోడు ఎంత అవసరమో దిల్ రాజ్ కు విడమర్చి చెప్పి ప్రకాష్ రాజ్ దిల్ రాజ్ మనసు మార్చాడు అన్న ప్రచారం జరుగుతోంది. తెలుస్తున్న సమాచారం మేరకు దిల్ రాజ్ ఇండస్ట్రీతో సంబంధం లేని ఒక మహిళను పెళ్ళి చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


త్వరలోనే దీనికి సంబంధించి ఒక క్లారిటీ స్వయంగా దిల్ రాజ్ ఇచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు. ప్రస్తుతానికి ఈ విషయాల గురించి చాలామందికి పూర్తి వివరాలు తెలిసినా దిల్ రాజ్ వ్యక్తిగత ఇమేజ్ దెబ్బ తీయకూడదు అన్న ఉద్దేశ్యంతో ఇండస్ట్రీ ప్రముఖులు మౌనం పాటిస్తున్నా మీడియా వర్గాలు మాత్రం దిల్ రాజ్ రెండవ పెళ్ళి వ్యవహారానికి సంబంధించిన వార్తలను ప్రముఖంగా ప్రచారంలోకి తీసుకు వస్తోంది..   

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: