సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌. ఈ సినిమా ప్రేమికుల రోజు కానుకగా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విజయ్‌ గత చిత్రాలు ఆశించిన స్ధాయిలో అలరించకపోవటంతో ఈ సినిమా మీదే ఆశలు పెట్టుకున్నాడు రౌడీ. అంటే ఈ సినిమా విజయ్‌ దేవరకొండకు యాసిడ్‌ టెస్ట్‌ లాంటిది. ఈ సినిమా సక్సెస్‌ కాకపోతే విజయ్‌ క్రేజ్‌తో పాటు మార్కెట్ మీద కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. మరి ఇలాంటి పరిస్థితి విజయ్‌ సత్తా చాటాడా..? వరుస ఫ్లాప్‌లతో కష్టాల్లో ఉన్న విజయ్‌ దేవరకొండ ఈ సినిమాలో సక్సెస్‌ ట్రాక్‌లోకి వచ్చాడు.

 

ఇప్పటి వరకు క్లాస్‌ చిత్రాలు మాత్రమే తెరకెక్కించిన దర్శకుడు క్రాంతి మాధవ్‌ తొలిసారిగా వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌తో ఓ ప్రయోగం చేశాడు. విజయ్‌ దేవరకొండను నాలుగు డిఫరెంట్‌ లుక్స్‌లో చూపించాడు. నలుగురు హీరోయిన్లు నటించిన ఈ సినిమాలో నాలుగు ప్రేమకథలు చూపించారు. ఈ సినిమాలో విజయ్‌కు జోడిగా రాశీ ఖన్నా, కేథరిన్‌ థ్రెస్సా, ఐశ్వర్యా రాజేష్, ఇసా బెల్లాలు నటించారు. సినిమాలో విజయ్ మార్క్‌ ఘాటు రొమాంటిక్‌ సీన్స్‌ కూడా చాలానే ఉన్నాయి. టీజర్‌ ట్రైలర్‌లు చూసిన ప్రేక్షకుల కూడా విజయ్‌ ఇంకా అర్జున్‌ రెడ్డి మూడ్‌ నుంచి బయటకు రాలేదన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

 

అయితే ఈ ప్రయోగం ఆశించిన స్థాయిలో వర్క్‌ అవుట్ కాలేదన్న టాక్‌ వినిపిస్తోంది. ఫస్ట్ హాఫ్ వరకు బాగానే ఉన్నా సెకండ్‌ హాఫ్‌లో కథా కథనాలు గాడితప్పాయంటున్నారు ఆడియన్స్‌. నోటా, డియర్‌ కామ్రేడ్‌ సినిమాల విషయంలో చేసిన తప్పులే విజయ్‌ ఈ సినిమా విషయంలో కూడా చేశాడంటున్నారు. దీనికి తోడు సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడటం కూడా సినిమా రిజల్ట్ మీద ప్రభావం చూపింది. ఆ స్థాయిలో కంటెంట్ లేకపోవటంతో అభిమానులు పెదవి విరుస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: