విజయ్ దేవరకొండ హీరోగా, రాశీఖన్నా, కేధరిన్, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లు గా నటించిన చిత్రం వరల్డ్ ఫేమస్ లవర్.  క్రాంతి మాధవ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఇప్పుడు యూత్ లో హాట్ టాపిక్ గా మారింది. విజయ్ లుక్స్, సినిమా ట్రైలర్, టీజర్ సహా మరికొన్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

 

ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ప్రేక్షకుల ముందుకి వస్తున్న ఈ సినిమాలో లవ్ ఫైల్యూర్ గా విజయ్ నటించే అవకాశం ఉందని టాక్. అర్జున్ రెడ్డి తరహాలోనే కథ కాస్త బోల్డ్ గా ఉండే అవకాశం ఉందనే వ్యాఖ్యలు కూడా వినపడుతున్నాయి. 

 

ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్లు కూడా కాస్త వేగంగా జరుగుతున్నాయి. ముగ్గురు హీరోయిన్లు ఉండటంతో విజయ్ ఏ విధంగా నటిస్తాడో అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ముఖ్యంగా యూత్ లో ఈ సినిమాకు ఉండే క్రేజ్ అంతా ఇంతా ఇంతా కాదనే చెప్పాలి.

 

ఈ నేపధ్యంలో సినిమాకు మరింత హైప్ తీసుకొస్తూ సినిమాలో హీరోయిన్ గా ఉన్న రాశీ ఖన్నా ఒక వీడియో ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. రాశీ ఖన్నా ఈ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా పోస్ట్ చేసిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

 

వాలెంటైన్స్ వీక్‌లో గురువారం నాడు కీలకమైన ‘కిస్ డే’ సందర్భంగా ఈ వీడియోను రాశీ పోస్ట్ చేసింది. ఇంస్టాగ్రా౦ లో పోస్ట్ చేసింది ఈ వీడియో. ఈ వీడియో లో హీరో విజయ్ దేవరకొండను రాశీ ఖన్నా ముద్దాడుతూ ఉంటుంది. దీనికి అభిమానులు ఫిదా అయిపోయారు.

 

ఈ పోస్ట్ చేసిన కాసేపటికే సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయింది. ఫాన్స్ ఫిదా అవ్వడంతో సినిమాకు మరింత క్రేజ్ వచ్చేసింది. హీరోయిన్లు కూడా ప్రమోషన్ చేయడంతో సినిమా వసూళ్లు భారీగా ఉండే అవకాశం ఉందని అంటున్నారు. వీకెండ్ కావడమే కాకుండా ఫిబ్రవరి 14 కావడం సినిమాకు మరింత కలిసి వచ్చిందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: