రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా నటించిన తాజా చిత్రం `వరల్డ్ ఫేమస్ లవర్`.  ఐశ్వర్య రాజేష్, కేథరిన్ థ్రెసా, రాశీ ఖన్నా, ఇజబెల్లా హీరోయిన్స్ గా న‌టించి ఈ సినిమాకి ఓనమాలు ఫేం క్రాంతి మాధవ్ దర్శకత్వం వహించాడు. గోపీ సుందర్ సంగీతం సమకూర్చగా.. కె.ఎస్.రామారావు సమర్పణలో క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌పై కె.ఎ.వల్లభ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక విజయ్ దేవరకొండ నటించిన సినిమాలకు యూత్ లో ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. అందులోనూ విజయ్ ప్రేమ కథలు చేసాడంటే దానిపై ఉండే ఆసక్తే వేరు. వరల్డ్ ఫేమస్ లవర్ విషయంలో కూడా ఇదే జరిగింది. 

 

గత సినిమా 'డియర్ కామ్రేడ్' తో నిరాశ పేర్చిన విజయ్.. ఈ సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్ర‌వ‌రి 14(నేడు) ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచింది. ఇక తన స్టైల్లో విజయ్ దేవరకొండ నిర్వహించిన ప్రమోషన్స్ కూడా సినిమాపై విపరీతమైన బజ్, హైప్‌ను క్రియేట్ చేశాయి. మ‌రోవైపు ఈ సినిమా ప్రీమియర్ షోలు ఇప్ప‌టికే ఓవర్సీస్‌లో మొదలయ్యాయి. విజయ్ సరసన ఈ చిత్రంలో నలుగురు హీరోయిన్లు నటించడం విశేషం. 

 

అయితే నలుగురు యువతులతో వేరు వేరు పేర్లతో ఉన్న విజయ్ లవ్ స్టొరీ ఎలా సాగింది అన్న కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కింది. అర్జున్ రెడ్డి తర్వాత ఆ తరహలో విజయ్ దేవరకొండ చేస్తున్న సినిమా కావడంతో సినిమాపైన మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇక సినిమా ప్ల‌స్‌లు.. మైన‌స్‌లు విషాయినికి వ‌స్తే.. విజయ్, రాశీ మరియు ఐశ్వర్య రాజేష్ పెర్ఫామెన్స్ సినిమా ప్ల‌స్ అని చెప్పాలి. అలాగే ఒకే సీరియస్ ఫ్లో లో సాగే కథనం, స్లో నెరేన్‌, అర్జున్ రెడ్డి షేడ్స్ మ‌రియు స్క్రీన్ ప్లే సినిమా మైన‌స్‌లుగా మారాయ‌ని అంటున్నారు. మ‌రి ఈ సినిమా ఎంద‌ వ‌ర‌కు ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటుందో చూడాలి.

 

 
 
  
 
 
 


 

మరింత సమాచారం తెలుసుకోండి: