టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి పదేళ్ల విరామం తర్వాత వివివినాయర్ దర్శకత్వంలో ‘ఖైదీ నెంబర్ 150’ మూవీతో హీరోగా రీ ఎంట్రీ ఇచ్చారు.  ఒకప్పుడు టాలీవుడ్ లో ట్రెండ్ సృష్టించిన ఆయన ఫైట్స్, డ్యాన్స్ లో ఎన్నో ప్రయోగాలతో ప్రేక్షకులను మెప్పించారు.  ఇప్పటికీ యంగ్ హీరోలు ఆయన స్టైల్ ఫాలో అవుతున్న విషయం తెలిసిందే.  అయితే చిరంజీవి స్వయంకృషితో పైకి వచ్చిన విషయం తెలిసిందే.  ప్రస్తుతం ఆయన కుటుంబం నుంచి పలువురు హీరోలు వెండి తెరపై రాణిస్తున్నారు.  అయితే చిరంజీవి తర్వాత ఆ రేంజ్ లో మాస్ ఇమేజ్ సొంతం చేసుకున్న హీరో పవన్ కళ్యాన్.. ఆ తర్వాత అల్లు అర్జున్, రామ్ చరణ్.  

 

ప్రస్తుతం ఆయన మేనళ్లుడు సాయిధరమ్ తేజ్..  మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ లు సైతం హీరోలుగా మంచి ఫామ్ లో కొనసాగుతున్నారు.  త్వరలో మరో మేనళ్లుడు వైష్ణవ్ తేజ్ కూడా ‘ఉప్పెన’ మూవీతో హీరోగా వస్తున్న విషయం తెలిసిందే.  ఇక చిరంజీవి నటించిన ‘ఖైదీ నెంబర్ 150’ తర్వాత సైరా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.  కానీ ఇది అనుకున్న స్థాయిలో ఫలితాన్ని రాబట్టలేకపోయింది.  దాంతో తన తదుపరి సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

 

తాజాగా ఆయన కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.  ఈ సినిమాలపై అప్పుడే భారీ అంచనాలు పెరిగిపోతున్నాయి.  ఈ మూవి గనక హిట్ అయితే చిరు మరోసారి తన ప్రాభవాన్ని కొనసాగిస్తారని అంటున్నారు. ఈ నేపథ్యంలో చిరు కోసం దర్శకనిర్మాతలు క్యూ కడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సుకుమార్, చిరంజీవిని కలిసి... లూసిఫెర్ స్క్రిప్ట్‌లో వచ్చిన మార్పులపై చర్చించారు. అయితే ఏ దర్శకుడు తన వద్దకు వచ్చినా.. సమాజానికి ఉపయోగపడే కథలతో రావాలని.. తాను చేసే సినిమాలలో మెస్సేజ్ ఉండాలని.. చిరు వాళ్ళకి సూచిస్తున్నాడని తెలుస్తుంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: