‘అల వైకుంఠపురములో’ సూపర్ సక్సస్ ను ఎంజాయ్ చేసిన అల్లు అర్జున్ ఇక తన ఆనందాలకు బ్రేక్ వేసి త్వరలో ప్రారంభం కాబోతున్న సుకుమార్ మూవీ కోసం మానసికంగా సిద్దపడుతున్నాడు. ఈ మూవీలో బన్నీ పాత్ర చాల రఫ్ పాత్ర అవ్వడంతో ఆ పాత్ర కోసం బన్నీ శారీరకంగానే కాకుండా మానసికంగా కూడ సిద్ధపడుతున్నాడు. 


ఇలాంటి పరిస్థితులలో అల్లు అర్జున్ ఒక అజ్ఞాత ప్రదేశంలోకి వెళ్ళి సుమారు ఐదు రోజుల పాటు ఎవరికీ అందుబాటులో ఉండకుండా తన మానసిక స్థితిని మార్చుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు బన్నీ ఎప్పుడు విదేశాలకు వెళ్ళినా అతడి భార్య పిల్లలు కానీ లేదంటే అతడి సినిమా యూనిట్ సభ్యులు కాని లేకుండా ఎప్పుడు బన్నీ విదేశాలకు వెళ్ళలేదు. 


అయితే ఇప్పుడు దీనికి భిన్నంగా అల్లు అర్జున్ విదేశాలలో ఉన్న ఒక అజ్ఞాత ప్రదేశానికి వెళ్ళి ఎవరికీ అందుబాటులో లేకుండా ఉంటూ తన మైండ్ పవర్ ను కంట్రోల్ చేసుకుని తన టోటల్ ఫోకస్ సుకుమార్ చెప్పిన పాత్ర గురించి ఆలోచనలు చేస్తూ తనను తాను మలుచుకోవడానికి ఇలాంటి ప్రయత్నం చేస్తున్నాడు అనుకోవాలి. తెలుస్తున్న సమాచారం మేరకు యోగా కు సంబంధించిన ఒక ఎడ్వాన్స్డ్ క్రాష్ కోర్స్ ను తీసుకోవడానికి బన్నీ ఈ అజ్ఞాత పర్యటన పెట్టుకున్నట్లు తెలుస్తోంది. 


సుకుమార్ మూవీలో అల్లు అర్జున్ నటిస్తున్నది ఒక లారీ డ్రైవర్ పాత్ర కావడంతో లారీ డ్రైవర్స్ బాడీ లాంగ్వేజ్ వారి మాటతీరును చాల సునిశితంగా బన్నీ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో బన్నీ పెంచిన గెడ్డంతో మాసిపోయిన లుంగీతో చాల రఫ్ లుక్ లో కనిపిస్తాడని సమాచారం. ఇప్పటికే ఈ మూవీలో బన్నీ మాట్లాడబోయే భాష చిత్తూరు యాసలో ఉండే నేపధ్యంలో సుకుమార్ సలహాతో ఈ చిత్తూరు యాసకు సంబంధించి బన్నీ ప్రత్యేకమైన శిక్షణ కూడ తీసుకుంటున్నాడు. ఈ అజ్ఞాతవాసం తరువాత సుకుమార్మూవీ షూటింగ్ ప్రారంభం కాబోతోంది..

 

మరింత సమాచారం తెలుసుకోండి: