అప్పట్లో ఆంధ్రా అందగాడు అనే సినిమా వచ్చింది . బహుషా ఈ సినిమా గురించి ఎవరికీ తెలిసి ఉండదు. కమెడియన్ సుమన్ శెట్టి హీరోగా సుధ కొంగర దర్శకత్వం వహించిన ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా తర్వాత చాలా రోజులకి తమిళంలో మాధవన్ హీరోగా ఇరుదు సుట్రు అనే సినిమా వచ్చింది. స్పోర్ట్ డ్రామా తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఇదే సినిమాని వెంకటేష్ హీరోగా తెలుగులో గురు పేరుతో రీమేక్ చేశారు.

 

 

తెలుగులోనూ ఈ సినిమా మంచి విజయం సాధించింది. పైన ఆంధ్రా అందగాడు సినిమాకి దర్శకత్వం వహించిన సుధ కొంగరనే ఈ రెండు సినిమాలకి దర్శకత్వం వహించారు. ఒకప్పుడు కామెడీ సినిమా తీసి ఫ్లాప్ ని మూటగట్టుకున్న సుధ కొంగర ఇరుదు సుట్రు సినిమాతో ఎక్కడికో వెళ్ళిపోయింది. వైజాగ్ కి చెందిన ఈ దర్శకురాలు ప్రస్తుతం సూర్యతీ "ఆకాశం నీ హద్దురా" అనే సినిమాను తెరకెక్కిస్తోంది.

 

 


వరుస ఫ్లాపుల్లో ఉన్న సూర్యకి ఈ సినిమా హిట్ తీసుకొస్తుందని నమ్మకంగా ఉంది. ఇప్పటికే ఈ సినిమా మీద మంచి పాజిటివ్ బజ్ ఏర్పడింది. ఈ సినిమాతో సూర్య ఖచ్చితంగా హిట్ కొట్టేలానే కనిపిస్తున్నాడు. ఇదిలా ఉంటే సుధ కొంగరకి ఇప్పుడు గోల్డెన్ ఛాన్స్ వచ్చిందట.  ఇప్పుడు కోలీవుడ్లో నంబ‌ర్ వ‌న్ హీరో అన‌ద‌గ్గ విజ‌య్‌తో సుధ సినిమా చేయ‌బోతోంద‌ట‌. ఇటీవ‌లే సుధ చెప్పిన క‌థ‌కు విజ‌య్ ఓకే చెప్పాడ‌ట‌. వీళ్లిద్ద‌రి క‌ల‌యిక‌లో ఈ ఏడాది వేస‌విలో ఓ సినిమా మొద‌ల‌వుతుంద‌ని.. దాన్ని వ‌చ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాల‌నుకుంటున్నార‌ని కోలీవుడ్లో ప్ర‌చారం జ‌రుగుతోంది.

 

 

 

వ‌చ్చే సంక్రాంతికి రాజ‌మౌళి సినిమా ఆర్ఆర్ఆర్ త‌మిళంలో కూడా పెద్ద ఎత్తునే విడుద‌ల కానుండ‌గా.. దానికి పోటీగా విజ‌య్-సుధ సినిమాను కూడా రిలీజ్ చేస్తార‌ట‌. మరి ఇదే నిజమైతే సుధ టాప్ డైరెక్టర్ల స్థాయికి వెళ్ళినట్టే..మొత్తానికి మన తెలుగు దర్శకురాలికి మంచి బ్రేక్ దొరికేలా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: