టాలెంట్ దర్శకుడు పూరి జగన్నాథ్ మరియు టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ ల కాంబోలో తెరకెక్కిన పక్కా మాస్ మసాలా డబల్ ధమాకా ఎంటర్టైనర్ చిత్రం “ఇస్మార్ట్ శంకర్”. నభా నటేష్ మరియు నిధి అగర్వాల్ లు హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం గత ఏడాది బాక్సాఫీస్ దగ్గర ఎంత స్థాయి హిట్టయ్యిందో అందరికీ తెలుసు. అలాగే ఈ చిత్రం ఒక్క టాలీవుడ్ ప్రేక్షకుల్లోనే కాకుండా ఇతర ఇండస్ట్రీ ప్రేక్షకుల్లో కూడా మంచి హాట్ టాపిక్ అయ్యింది. దీనితో ఇస్మార్ట్ శంకర్ మ్యానియా బాలీవుడ్ దాకా పాకింది. 

 

ఇక దీనితో ఈ చిత్రాన్ని హిందీలో డబ్బింగ్ చేసి వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా టెలికాస్ట్ కూడా చెయ్యబోతున్నారు. అందులో భాగంగా ఈ చిత్రాన్ని టెలికాస్ట్ చెయ్యబోతున్న సోనీ మాక్స్ చానెల్ వారు ఈ చిత్రానికి హిందీలో గట్టిగానే ప్రమోషన్ చేస్తుండగా సోషల్ మీడియాలో మరోసారి ఈ సినిమా మంచి హాట్ టాపిక్ అవుతుంది.ఈ ఫిబ్రవరి 16న రాత్రి 8 గంటలకు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా సెట్ మాక్స్ ఛానెల్లో ప్రసారం అయ్యి భారీ టీఆర్పీ రికార్డులు కొడుతుంది.. అంటూ సోషల్ మీడియాలో రామ్ ఫాలోవర్స్ అంటున్నారు. 

 

అంతే కాకుండా హిందీ ప్రేక్షకుల నుంచి కూడా ఈ సినిమాపై మంచి హైప్ కూడా ఉంది. మరి ఈ చిత్రం ఏపాటి టీఆర్పీ రేటింగ్స్ ను సాధిస్తుందో ఇంకొద్ది రోజులు ఆగితే తెలిసిపోతుంది. గత ఏడాది విడుదలైన సినిమాలలో డిస్ట్రిబ్యూటర్లకు కాసుల వర్షం కురిపించిన సినిమాగా “ఇస్మార్ట్ శంకర్” చిత్రం ఖచ్చితంగా ముందు వరుసలో ఉంటుంది. పూరి అభిమానులు అలాగే ఎనర్జిటిక్ స్టార్ రామ్ అభిమానులకు ఈ సినిమా ఒక హైదరాబాదీ దమ్ బిర్యానిలా దొరికింది.

 

అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ చిత్రానికి పూరి డైరెక్షన్ తో పాటుగా సంగీత బ్రహ్మ మణిశర్మ అందించిన సంగీతం కూడా పెద్ద ఎస్సెట్ గా నిలిచింది. మణిశర్మ అందించిన పాటలు కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఒక రేంజ్ లో మాస్ ప్రేక్షకులను ఊపేసాయి. అయితే ఎంతో హిట్టయ్యిన వీడియో సాంగ్స్ కోసం మాత్రం మ్యూజిక్ లవర్స్ ఎక్కువగానే ఎదురు చూసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: