తెలుగు ఇండస్ట్రీలో తేజ దర్శకత్వంలో ‘జయం’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు నితిన్.  ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయ్యింది.  ఆ తర్వాత దిల్ రాజు బ్యానర్ లో ‘దిల్’ చిత్రంతో మరో ఘన విజయం అందుకున్నాడు నితిన్.  అయితే తెలుగు ఇండస్ట్రీలో నితిన్ నటించిన చిత్రాలె ఎన్నో ఉన్నా.. అందులో హిట్ మాత్రం చాలా తక్కువే అని చెప్పాలి. కాకపోతే ఈ హీరో కెరీర్ మాత్రం ఎక్కడా డ్యామేజ్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటు న్నాడు.  ఇండస్ట్రీలోకి వచ్చి ఇప్పటికే పదిహేనేళ్లు దాటినా.. తన తోటి నటులకు వివాహం జరిగినా నితిన్  మాత్రం బ్యాచ్ లర్ గా ఉంటూ వస్తున్నారు.  టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో ఒకడైన నితిన్ పెళ్లి గురించి గత కొన్నేళ్లుగా చర్చ సాగుతోంది.  

 

తన వివాహం గురించి కుటుంబ సభ్యులు ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఎప్పటికప్పుడు పోస్ట్ పోన్ చేస్తూ వచ్చాడు. మొత్తానికి నితిన్ పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతున్నాడు. నితిన్ పెళ్లికి ముహూర్తం కుదిరింది. ఏప్రిల్ 16న నితిన్ వివాహం షాలిని అనే యువతితో జరగబోతోంది.  రేపే హైదరాబాద్ లో నితిన్ ఇంట్లో గ్రాండ్ గా నిశ్చితార్ధం జరిపించనున్నారు.  నితిన్ సోదరి నిఖితా రెడ్డి దగ్గరుండి పెళ్లి పనులన్నీ చూసుకుంటున్నారు.  మొదటి నుంచి నితిన్ ప్రతి విషయం ఆయన సోదరి దగ్గరుండి చూసుకుంటున్న విషయం తెలిసిందే. 

 

అయితే ఇప్పటివరకు నితిన్ కి కాబోయే భార్య ఫోటోలు బయటకి రాలేదు. తాజాగా ఒక ఫోటో బయటకి వచ్చింది. ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.  నితిన్ 2018లో 'శ్రీనివాస కళ్యాణం' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఈ చిత్రం అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోయింది.  ప్రస్తుతం నితిన్  'భీష్మ' అనే చిత్రంలో నటిస్తున్నాడు. వెంకీ కుడుముల డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రం మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: