ఈ ఏడాదికి మోస్ట్ టాక్ ఆఫ్ ది ఇండియన్ సినిమాల్లో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నది ఖచ్చితంగా ఆర్ఆర్ఆర్ మూవీనే. బాహుబలితో ఇండియన్ క్రేజీ డైరక్టర్ గా మారిపోయిన రాజమౌళి దర్శకత్వం ఓ కారణమైతే.. టాలీవుడ్ లో సమఉజ్జీలైన ఇద్దరు స్టార్ హీరోలు రామ్ చరణ్ఎన్టీఆర్ కాంబో మూవీ కావడం మరో కారణం. జూలై 30న రిలీజ్ అని మేకర్స్ చేసిన ప్రకటనకు దేశమంతా ఎదురుచూసింది. కానీ రీసెంట్ గా సినిమా రిలీజ్ డేట్ ను వచ్చే ఏడాది జనవరి 8కి మార్చారు. ఇక ఫ్యాన్స్ అయితే తమ హీరోల ఫస్ట్ లుక్ కోసం నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు.

 

 

అయితే ఇప్పుడు వారి ఆకలి తీర్చే న్యూస్ ఒకటి సినిమా ఇండస్ట్రీలో రౌండ్ అవుతోంది. రామ్ చరణ్ లుక్, ఎన్టీఆర్ లుక్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ డేట్స్ ఫిక్స్ చేశారని అంటున్నారు. మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు. కాబట్టి ఆరోజున చరణ్ చేస్తున్న అల్లూరి సీతారామరాజు లుక్ రిలీజ్ చేసే ఆలోచనలో టీమ్ ఉన్నట్టు సమాచారం. మే20న ఎన్టీఆర్ పుట్టినరోజు. ఆరోజు ఎన్టీఆర్ చేస్తున్న కొమరం భీమ్ లుక్ రిలీజ్ చేస్తారని అంటున్నారు. ప్రస్తుతం ఈ వార్త ఇండస్ట్రీలో రౌండ్ అవుతోంది. ఈ వార్తతో ఇద్దరు హీరోల ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అయితే ఈ వార్తపై అఫిషియల్ న్యూస్ రావాల్సిందే.

 

 

అయితే.. సినిమాపై పెరిగిపోతున్న అంచనాలకు టీమ్ ఈ డేట్స్ లో వారిద్దరి లుక్స్ రిలీజ్ చేయడమే కరెక్ట్. ఎందుకంటే సినిమాపై హైప్ పెంచుకోవడానికి అభిమానులకు ఫీస్ట్ ఇవ్వడానికి వీరిద్దరి లుక్స్ ఉపయోగపడతాయి. వీటికంటే ముందు ఆర్ఆర్ఆర్ కు తెలుగు టైటిల్ ను కన్ఫర్మ్ చేయాల్సి ఉంది. ఇదే టైటిల్ ఉంచుతారా.. తెలుగు టైటిల్ పెడతారా అనేది కూడా తెలియాల్సి ఉంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: