ఈ మద్య కొంతమంది అసాంఘిక శక్తులు ప్రజల మనోభావాలను దెబ్బతీసే పనిలే తాము ఏం చేస్తున్నామో తెలియని ఉన్మాదమైన స్థితిలో ఉన్నారు.  దేశ వ్యాప్తంగా కొంత మంది దుర్మార్గులు హిందూ దేవాలపై, విగ్రహాలపై దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. అలాంటి దారుణాలకు పాల్పపడుతూ వీడియో షూట్ చేయడం.. ఫోటోలు షేర్ చేయడం లాంటి పనులు చేస్తున్నారు.  తాజాగా నెల్లూరు జిల్లా బిట్రగుంట వేంకటేశ్వరస్వామి ఆలయం పరిధిలో అపశ్రుతి చోటు చేసుకుంది. స్వామివారి రథం ఈ తెల్లవారు జామున దగ్ధమైంది.

 

మార్చి 4న రథోత్సవం జరగనున్న నేపథ్యంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. అయితే ఆలయ ఆవరణలో నిలిపి ఉంచిన ప్రాచీన రథం ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించుకునే రథం అర్ధరాత్రి మంటలు చెలరేగడం గమనించిన స్థానికులు ఆర్పేందుకు ప్రయత్నించారు. అప్పటికే మంటలు వ్యాపించి రథం పూర్తిగా కాలిపోయింది. గుర్తు తెలియని వ్యక్తులు రథానికి నిప్పు పెట్టి ఉంటారని గ్రామస్థులు చెబుతున్నారు.  కాగా, ప్రతి ఏటా రథాన్ని అంగరంగ వైభవంగా ముస్తాబు చేసి కన్నుల పండువగా రథోత్సవాన్ని నిర్వహిస్తారు. మరో పక్షం రోజుల తర్వాత ఉత్సవం జరగనున్న నేపథ్యంలో జరిగిన ఘటనతో భక్తులు నొచ్చుకున్నారు.

 

ఇంతలోనే కొంత మంది దుర్మార్గులు ఈ దారుణాని పాల్పపడటం పెద్ద చర్చనీయాంశంంగా మారింది.  ఘటనపై వెంటనే స్పందించిన దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు జిల్లా ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడారు. నిందితులను తక్షణం పట్టుకోవాలని ఆదేశించారు. బహుషా ఇది ఎవరైనా ఆకతాయిలు చేసిన పనా.. లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయ అన్న విషయంపై సమగ్ర దర్యాప్తు చేయిస్తామని అన్నారు. అలాగే ఆకతాయిల చర్యల వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా తక్షణం పునర్నిర్మాణ చర్యలు చేపట్టాలని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఉషారాణిని ఆదేశించారు. ఏది ఏమైనా పమర పవిత్రంగా భావించే శ్రీవారి రథాన్ని ఇలా చేయడం పాపం అని అక్కడి ప్రజలు అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: