ఈ సంక్రాంతికి వచ్చిన అల వైకుంఠపురంలో సినిమా ఎంతలా విజయం సాధించిందో చెప్పక్కర్లేదు.  సినిమా భారీ విజయం సొంతం చేసుకోవడంతో పాటుగా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.  నాన్ బాహుబలి హిట్ అందుకోవడంతో యూనిట్ ఖుషి అయ్యింది.  కేవలం ఒక ప్రాంతీయ సినిమాగా వచ్చి ఈ స్థాయిలో విజయం సాధించడం అంటే మాములు విషయం కాదు.

 

 దాదాపుగా రూ. 157 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసింది.  
ఒక్క సౌత్ లోనే ఈస్థాయిలో వసూళ్లు సాధిస్తే... ఇక పాన్ ఇండియాగా వస్తే ఏ రేంజ్ లో సినిమా వసూళ్లు సాధిస్తుంది... ఒక్కసారి అర్ధం చేసుకోండి.  అందుకే నెక్స్ట్ సినిమాను బన్నీ పాన్ ఇండియా స్థాయిలో చేయాలని అనుకుంటున్నాడు.  ఇది వేరే విషయం అనుకోండి.  ప్రస్తుత విషయానికి వస్తే, బన్నీ  సూపర్ హిట్ సినిమా అల వైకుంఠపురంను బాలీవుడ్ కు తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నాడు అల్లు అరవింద్.  


ఇప్పుడు ఈ సినిమాను బాలీవుడ్ లో తీస్తే ఎవరు చేస్తున్నారు.. ఎలా చేస్తున్నారు అనే విషయాలను చర్చించేందుకు అల్లు అరవింద్ రెడీ అవుతున్నాడు. సౌత్ నుంచి వరసగా సినిమాలు బాలీవుడ్ లో రీమేక్ అవుతున్నాయి.  టెంపర్, అర్జున్ రెడ్డి రీసెంట్ గా జర్సీ సినిమాలు హిందీ లో రీమేక్ అయ్యాయి.  జర్సీలో షాహిద్ కపూర్ హీరోగా చేస్తున్నారు.  అలానే తమిళంలో హిట్టైన కాంచన సినిమాను అక్షయ్ కుమార్ చేస్తున్నారు.

 
ఇప్పుడు తెలుగులో సూపర్ అందుకున్న అల వైకుంఠపురంలో సినిమా కూడా బాలీవుడ్ కు వెళ్ళబోతున్నది.  అల్లు అరవింద్ ఈ సినిమాను అక్కడ రీమేక్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.  గతంలో గజినీ సినిమా హిందీలో రీమేక్ చేసి సంచలన విజయం సొంతం చేసుకున్నాడు.  ఆ సినిమా రూ. 100 కోట్ల వరకు వసూళ్లు సాధించింది.  అదే విధంగా ఇప్పుడు అల సినిమాను కూడా రీమేక్ చేయబోతున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: