యువత ప్రేమికుల రోజు సంబరాల్లో ఉండగా వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ థియేటర్లలోకి వచ్చాడు.  సెన్సేషనల్ స్టార్‌ విజయ్‌ దేవరకొండ హీరోగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు డివైడ్‌ టాక్‌ వస్తోంది. ముఖ్యంగా నటీనటులు సూపర్బ్‌ పర్ఫామెన్స్‌ తో ఆకట్టుకోగా దర్శకుడు మాత్రం కథా కథనాల విషయంలో తడబడ్డాడన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అది ఈ విశ్లేషణలు ఎలా ఉన్నా కొన్ని సీన్స్‌కు మాత్రం థియేటర్లలో సూపర్బ్ రెస్సాన్స్‌ వస్తోందంటున్నారు ఫ్యాన్స్‌.

 

ముఖ్యంగా సినిమాలో ఎమోషనల్‌ సీన్స్‌ బాగా వర్క్‌ అవుట్ అయ్యాయట. శీనయ్య, సువర్ణల ప్రేమకథ ఓ రేంజ్‌లో పండిదని వారిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు, నవ్వించటంతో పాటు కంటతడి కూడా పెట్టిస్తాయంటున్నారు ఆడియన్స్‌ ఈ పాత్రల్లో విజయ్ దేవరకొండ, ఐశ్వర్య రాజేష్‌లు ది బెస్ట్ పర్ఫామెన్స్‌ ఇచ్చారంటున్నారు ఆడియన్స్‌. ముఖ్యంగా ఐశ్వర్య రాజేష్‌ నటనను ప్రత్యేకంగా అభినందిస్తున్నారు.

 

రాశీ కూడా బెస్ట్ ఫర్పామెన్స్‌ ఇచ్చిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాశీ, విజయ్‌ దేవరకొండ కాంబినేషన్‌లో వచ్చే సన్నివేశాలకు కూడా థియేటర్లలో మంచి రెస్సాన్స్‌ వస్తోంది. ఇక విజయ్‌ మార్క్‌ పంచ్‌ డైలాగ్‌లు మేనరిజమ్స్‌ అభిమానులకు సూపర్బ్ అనిపిస్తాయి. ఓవరాల్‌ సినిమా ఫస్ట్‌ హాఫ్ బాగానే ఉన్నా.. ద్వితీయార్థంలో దర్శకుడు చేసిన పోరపాట్ల కారణంగా కాస్త బోరింగ్‌గా అనిపిస్తుందంటున్నారు.

 

పూర్తిగా క్రాంతి మాధవ్‌ సినిమాలా లేకపోవటం, అలా అని పూర్తిగా విజయ్‌ దేవరకొండ సినిమాలా కూడా లేకపోవటతో వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ ఏ వర్గాన్ని పూర్తి స్థాయిల అలరించలేకపోతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి టాక్‌ ఇలా ఉంటే కేవలం విజయ్‌ దేవరకొండ ఇమేజ్‌ ఈ సినిమాను ఎంతవరకు కాపాడుతుందో చూడాలి. విజయ్‌ దేవరకొండ సరసన రాశీ ఖన్నా, ఐశ్వర్య రాజేష్‌, కేథరిన్‌ థ్రెస్సా, ఇసా బెల్లాలు హీరోయిన్లు గా నటించిన ఈ సినిమాను క్రియేటివ్‌ కమర్షియల్స్‌ బ్యానర్‌పై వల్లభ నిర్మించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: