భారతీయ చలన చిత్ర రంగంలో అతి పిన్న వయసులో తన సంగీతంతో కోట్ల మందిని మంత్ర ముగ్దులను చేసిన మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రహమాన్ తాజాగా మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. సర్వీస్ ట్యాక్స్ బకాయి ఉన్నారంటూ GST కమిషనర్.. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ కు నోటీసులు జారీ చేశారు. దీన్ని సవాల్ చేస్తూ రెహ్మాన్  మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. రెహమాన్‌ చెల్లించాల్సిన పన్ను రూ.6.79కోట్లు, జరిమానా మరో రూ.6.79కోట్లతో సహా చెల్లించాల్సిందిగా జీఎస్టీ, కేంద్ర ఎక్సైజ్‌ శాఖలు ఆదేశాలు జారీ చేశాయి. రెహమాన్‌ తన ఆర్జనకు తగినట్టుగా పన్ను చెల్లించడం లేదని జీఎస్టీ కమిషనర్‌ (చెన్నై సౌత్‌) కేఎం రవిచంద్రన్‌ అన్నారు. 

 

అయితే తన చిత్రాలకు సంగీతాన్ని సమకూర్చటంతో పాటు దేశ విదేశాల్లో బహిరంగ ప్రదర్శనలతో, రాయల్టీల ద్వారా కూడా ఆయన ఆదాయాన్ని పొందుతున్నారు. ఆయన సంపాదిస్తున్న డబ్బు  వస్తుసేవల పన్ను పరిధిలోకి వస్తాయి. కానీ, రహమాన్ మాత్రం  వాటికి పన్ను చెల్లించలేదు  అని రవిచంద్రన్‌ వివరించారు.  దాంతో వివాదం పెద్ద ఎత్తున చర్చలకు వచ్చింది.  కాగా, తన పాటలపై సినీ నిర్మాతలకు పేటెంటు హక్కులు ఇచ్చిన తర్వాత దానిపై ఎటువంటి పన్నులు చెల్లించాల్సి వున్నా వారిదే బాధ్యతని స్పష్టం చేశాడు. అందువల్ల తనకు నోటీసులు జారీ చేయడం చట్ట విరుద్ధమని కోర్టుకు తెలిపాడు.

 

పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి రెహ్మాన్‌కు పంపిన నోటీసుపై మార్చి 4వ తేదీ వరకు ఎటువంటి చర్య తీసుకోవద్దని ఆదేశిస్తూ స్టే విధించారు. అంతే కాకుండా ఈ పిటీషన్‌పై రెండు వారాల్లోగా కౌంటర్‌ అఫిడివిట్‌ దాఖలుచేయాలని న్యాయమూర్తి జీఎస్‌టీ కమిషనర్‌కు నోటీసు జారీ చేశారు.  ఏఆర్ రెహమాన్ సంగీతం అంటే ఎవరైనా చెవి కోసుకుంటారు.. ఆయనకు ఆస్కార్ అవార్డులు కూడా గెల్చుకున్న విషయం తెలిసిందే.  మరి ఈ వివాదం ఎంత వరకు వెళ్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: