సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్, మొదట అన్న ఎన్టీఆర్ గారి యొక్క ఆశీస్సులతో టాలీవుడ్ కి నటుడిగా అడుగుపెట్టడం జరిగింది. మొదట అక్కడక్కడ సినిమాల్లోని చిన్న పాత్రల్లో నటించిన రాజేంద్ర ప్రసాద్, ఆపై మెల్లగా తన యాక్టింగ్ టాలెంట్ తో వరుసగా అవకాశాలు అందుకుంటూ ముందుకు సాగారు. ఆపై ఎక్కువగా కామెడీ సినిమాల్లో నటించి, తన నటనలో గొప్ప హాస్య చతురతను బయటకు తీసి మంచి హాస్య నటుడిగా టాలీవుడ్లో పేరు సంపాదించుకున్నారు. ఇక మధ్యలో కొన్ని సినిమాల్లో సెకండ్ హీరో పాత్రల్లో కూడా నటించిన రాజేంద్ర ప్రసాద్, హీరోగా కొనసాగుతున్న సమయంలో యండమూరి వీరేంద్రనాథ్ కథ ద్వారా వెండి తెరపై తెరకెక్కిన ముత్యమంత ముద్దు అనే విభిన్న ప్రేమకథా చిత్రంలో హీరోగా నటించారు. 

 

సీత హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో సుధాకర్, బ్రహ్మానందం, అలీ,మురళి మోహన్, రంగనాథ్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో ప్రమోద ఆర్ట్స్ బ్యానర్ పై 1989లో రిలీజ్ అయిన ఈ సినిమా అప్పట్లో పెద్దగా విజయవంతం కానప్పటికీ, ప్రేమకథల్లో ఒక హృద్యమైన ప్రేమకథగా ఇప్పటికీ కొందరు ఈ సినిమాని తలుచుకుంటూ ఉంటారు. అనుదీప్ అనే ఒక యువకుడు ఒకసమయంలో విద్యాధరి అనే అమ్మాయిని చూసి తోలి చూపులోనే నిజాయితీగా ఆమెను ఇష్టపడతాడు. అయితే నిజమైన ప్రేమ కోసం నిజాయితీగా ఘోర తపస్సు చేసి దైవ కృపతో కొన్ని శక్తులు పొందుతాడు. అనంతరం విద్యాధరిని కలుసుకున్న అనుదీప్, తన శక్తులను కొన్ని సందర్భాల్లో ఆమెపై ప్రదర్శిస్తాడు. 

 

కానీ దానిని ఆమె తప్పుగా అర్ధం చేసుకోవడంతో, తన ప్రేమ కనుక నిజాయితీ గలది అయితే, తాను అనుకున్నవి జరిగేలా వరం ఇవ్వమని దేవుడిని ప్రార్ధించానని, దానితో ఆయన ప్రత్యక్షమై తనకు గొప్ప శక్తులు ఇచ్చాడని చెప్తాడు. ఆ మాటలకు విద్యాధరి అతడిని నమ్మకపోగా మరింత అసహ్యించుకుంటుంది. ఇక చివరికి ఆమె వలన తన ప్రాణాలను సైతం పోగొట్టుకునేందుకు సిద్ధం అయిన అనుదీప్ నిజమైన ప్రేమను గుర్తించిన విద్యాధరి, అతడి ప్రేమని అంగీకరిస్తుంది. అప్పట్లోనే కాక ఇప్పటికీ కూడా ఈ సినిమాకు కొందరు అభిమానులు ఉన్నారంటే, రచయిత యండమూరి ఈ కథను ఎంత గొప్పగా రాశారో, దర్శకుడు రవిరాజా పినిశెట్టి ఇంకెంత అద్భుతంగా తీశారో అర్ధం చేసుకోవచ్చు.....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: