అయిదేళ్ల క్రితం అనసూయ తన అందచందాలతో కుర్రకారుని ఎలా రాత్రులు నిద్ర పోకుండా చేసిందో... పెళ్లయి ఇద్దరు పిల్లలకి తల్లి అయిన చాలా సంవత్సరాల తరువాత కూడా తన తరిగిపోని మత్తెక్కించే అందంతో చాలా మందిని ఆకట్టుకుంటుంది. జీ తెలుగులో ప్రసారం అవుతున్న అదిరింది షోలో ఆమె చేసే రొమాంటిక్ డాన్స్ కి కొన్ని లక్షల మంది అభిమానులు ఉన్నారు అంటే అతిశయోక్తి కాదు. ఆమె పాపులారిటీకి తగ్గట్టుగానే ప్రతి షోకి ఆమె బాగా రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. కానీ ఆమె పారితోషకం కచ్చితంగా ఎంతో చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది. తాజాగా ఆమె ఒక్క ఈవెంట్ చేసినందుకు తీసుకునే రెమ్యూనరేషన్ ఎంతో ఒక కమెడియన్ బహిరంగంగా చెప్పేసాడు.


విషయానికి వస్తే వచ్చే వారానికి సంబంధించిన జబర్దస్త్ కామెడీ షో యొక్క ప్రోమోని ఈటీవీ నిర్వాహకులు యూట్యూబ్ లో విడుదల చేశారు. అయితే ఇందులోని హైపర్ ఆది స్కిట్ లో అనసూయపై కొన్ని పంచులు పేలతాయి. ముఖ్యంగా హైపర్ ఆది మాట్లాడుతూ... నువ్వు ప్రతి ఈవెంట్ కి రూ. 3లక్షలు తీసుకుంటావు మూడు అంతస్తుల భవనం కట్టాలన్న కట్టగలవు అని అంటాడు. దీంతో అనసూయ షాక్ అవుతుంది. నా రెమ్యూనరేషన్ విషయం గురించి ఎందుకు చెప్పినవ్ అంటూ విని వినపడనట్లు తిడుతుంది. అయితే ఇక్కడ హైపర్ ఆది చెప్పిన పారితోషికం కంటే అనసూయ ఒక ఈవెంట్ కి ఎక్కువగానే డబ్బులను వసూలు చేస్తుందని సమాచారం.


ఇకపోతే అనసూయ జబర్దస్త్ షోతో పాటు సినిమాలలో ఈవెంటులలో, షాపింగ్ మాల్ ఓపెనింగులలో పాల్గొంటూ రెండు చేతులా చాలా లక్షల రూపాయలను సంపాదిస్తోంది. డబ్బు కోసం స్కిన్ షో, ఎక్స్పోజింగ్ చేసేందుకు ఏ మాత్రం వెనుకాడడం లేదు. ఏదేమైనా కాస్త వయసు అయిపోతే యాంకర్ కి అవకాశాలు సన్నగిల్లి పోతాయి. అందుకే గ్లామర్ ఉన్నప్పుడే వీలైనన్ని ఈవెంట్లను చేసి కోట్లను తన బ్యాంకు అకౌంట్ లో వేసుకుంటుంది అనసూయ. 

మరింత సమాచారం తెలుసుకోండి: