కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య షూటింగ్ జరిపినా.. ట్రిపుల్ ఆర్ కు లీకులు తప్పడం లేదు. రీసెంట్ గా ఎన్టీఆర్ వీడియో బయటికొచ్చేయడంతో.. సెక్యూరిటీ మరింత పెంచారు. ఈ రక్షణ సినిమాకు కాదు. ఎడిటింగ్ రూమ్ కు. 

 

రాజమౌళి సినిమాలో నటించే ప్రతీ ఆర్టిస్టూ.. టెక్నీషియన్ కు ఐడీ కార్డ్ ఇస్తారు. అంతేకాదు.. సెట్స్ లోకి ఫోన్ తీసుకురాకూడదు. ఈ క్రమంలో ఇండోర్ షూటింగ్ లో లీక్ కు ఆస్కారం లేకపోయినా.. ఔట్ డోర్ లో షూటింగ్ అంటే.. మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తోంది జక్కన్న టీమ్. ఇలా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. గతంలో బాహుబలి టైమ్ లో లీకులు తప్పలేదు. 

 

ట్రిపుల్ ఆర్ లో ఎన్టీఆర్ కొమురం భీమ్ గా నటిస్తున్నాడు. సింహంతో పోరాడే సన్నివేశాన్ని ఇంట్రక్షన్ సీన్ గా చిత్రీకరిస్తే.. కొంత భాగం వీడియో లీకైంది. అయితే వెంటనే అప్రమత్తమైన చిత్ర యూనిట్ నెట్ లో లింకులను తొలగించింది. ఎక్కడి నుంచి లీకైందా.. అని ఆరా తీస్తే.. ఎడిటింగ్ టేబుల్ నుంచేనని తెలిసింది. దీంతో ఎడిటింగ్ రూమ్ దగ్గర సెక్యూరిటీని టైట్ చేశారు. 

 

జులై 30న రావాల్సిన ట్రిపుల్ ఆర్ దసరాకు వెళ్లిపోవడంతో.. ఇంకో తొమ్మిది నెలలు సినిమాను జాగ్రత్తగా కాపాడుకోవాలి. 400కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కే ఈ సినిమా లీకుల భారిన పడకుండా చూసుకోవాలి. ప్రస్తుతం అజయ్ దేవగణ్ పాల్గొంటున్న సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. 

 

జక్కన్న మూవీ అంటే సినీ అభిమానులకు ఎక్కడ లేని హుషారు వచ్చేస్తుంది. ఎందుకంటే ఆయన స్టోరీ.. దర్శకత్వం.. హీరోల హీరోయిజం.. విలన్ల విలనిజం.. సెంటిమెంట్ తెగ పండించేస్తారు. అందుకే సినీ అభిమానులకు రాజమౌళి అంటే అంత ఇష్టం. ఆయన తీసే త్రిపుల్ ఆర్ మూవీపైనే అందరి కళ్లున్నాయి. ఆ సినిమా ఎపుడు వెండితెరపై మెరుస్తుందో చూడాలని తెగ ఆరాటపడిపోతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: