ఆర్ ఎక్స్ 100 అనే సినిమాతో రయ్యి రయ్యి మంటూ తెలుగు సినిమా ఇండ్రస్ట్రీలోకి వేగంగా దూసుకొచ్చి సక్సెస్ సాధించిన కుర్ర హీరో కార్తికేయ పేరు ఓ రేంజ్ లో మారుమోగిపోయింది. ఇక అదే దూకుడుతూ మరింత వేగంగా సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్లిన కార్తికేయకు ప్లాప్ లు కూడా అదే రేంజ్ లో పలకరించాయి. ఒకే ఏడాది మూడు సినిమాలు చేసినా హిట్ అనీ కిక్కు అతడికి దక్కలేదు. హిప్పి, గుణ 365, 90 ఎంఎల్ ఇలా డిఫ్రెంట్ డిఫ్రెంట్ సినిమాలు డిఫ్రెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లు ఎంచుకున్నా ఫలితం దక్కలేదు. 

 

హీరోగా ఎలా హిట్టు అందుకోలేకపోతున్నామనే బాధతో విలన్ గా ప్రయత్నించినా పరిస్థితిలో మార్పు రాలేదు. విలన్ పాత్రలో నటించిన గ్యాంగ్ లీడర్ సినిమా కూడా బాక్సాపీస్ వద్ద బోల్తా కొట్టింది. ఇక అప్పటి నుంచి సైరైనా బ్రేక్ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూపులు చూస్తున్నాడు. ఇలా ఎదురు చూపులు చూస్తున్న ఈ కుర్ర హీరోకి '' గీత ఆర్ట్స్ '' చావు కబురు చల్లగా'' చెప్పింది. ప్రతిష్టాత్మకమైన గీత ఆర్ట్స్ లో సినిమా అంటే హిట్ గ్యారంటీ అనే నమ్మకం ఉండడంతో '' చావు కబురు చల్లగా'' చెప్పేందుకు కార్తికేయ సిద్ధం అయిపోయాడు. 

 

కౌశిక్ పెగల్లపాటి అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందిందిస్తున్నాడు. అరవింద్ సమర్పణలో బన్నీ వాసు ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఈ సినిమాలో బస్తీ బాలరాజు అనే ఫన్నీ క్యారెక్టర్ చేస్తున్నాడు కార్తికేయ. ఈ సినిమా ఫస్ట్ లుక్ తాజాగా లాంచ్ చేశారు. అసలు ఈ సినిమాలో చావు కబురు చల్లగా'' అని పెట్టడం వెనుక కారణం ఏంటి అనేది ఈ సినిమా ఫస్ట్ లుక్ చూస్తేనే అర్ధం అయిపోతుంది. ఈ సినిమాలో స్వర్గపురి అనే వాహనం అని రాసి ఉన్న వ్యాన్ మీద కార్తికేయ నిలబడి ఉండడం చూస్తుంటే ఈ సినిమాలో చనిపోయిన వ్యక్తులను ఊరేగించి తీసుకెళ్లే వ్యాన్ డ్రైవర్ పాత్రను కార్తికేయ పోషిస్తున్నట్టుగా అర్ధం అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: